రాజ్ తరుణ్ తక్కువోడేమీ కాదు. చూడ్డానికి అలా కనిపిస్తాడు కానీ, చటుక్కున ముద్దెట్టేసాడు. ఎవరికీ? ఇంకెవరికి. హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ కు. కిట్టూ వున్నాడు జాగ్రత్త సినిమా కోసం రాజ్ తరుణ్ లిప్ టు లిప్ కిస్ కు సై అనేయడం కాకుండా, చటుక్కున చేసేసాడట.
సినిమాలో ఫన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స మధ్య రొమాన్స్ కు కాస్త చోటు తక్కువ అని డైరక్టర్ వంశీకృష్ణ (దొంగాట ఫేమ్) ఫీలవడంతో, ఆ గ్యాప్ ఫిల్ చేసినట్లు వుంటుంది, ప్రేమ ఘాటు తెలిపినట్లూ వుంటుంది అనుకుని, అను ఇమ్మాన్యుయేల్ పెదాలపై రాజ్ తరుణ్ ముద్దెట్టేసాడట.
ఏమిటో..కామెడీ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలను కూడా ఈ ముద్దుముచ్చట్లతో ఘాటెక్కించేస్తున్నారు. అసలే ఇంకా ఇండస్ట్రీకి వచ్చి అను కి ఇది రెండో సినిమా. రెండో సినిమాకే ఇలా లి.టు.లి ముద్దుతో రెచ్చిపోయి, తను దేనికైనా రెడీ అని అను చెప్పకనే చెప్పేస్తే, మన జనాలు ఇక వరుసగా బుక్ చేసి, ముద్దులెట్టించేస్తారేమో?