డైరక్టర్ సురేందర్ రెడ్డి – హీరో అఖిల్ కాంబినేషన్ లో రూపొందే సినిమాకు నిర్మాత దాదాపుగా దొరికేసినట్లే. ఈ ప్రాజెక్టు నుంచి క్రిష్-రాజీవ్ రెడ్డిల బ్యానర్ తప్పుకుంది. ఆ విషయం తెలియక, క్రిష్ బ్యానర్ నే నిర్మాత అని కొన్ని వెబ్ మీడియాలు రాసుకుంటున్నాయి. నిజానికి క్రిష్ ఎప్పుడో ఆ ప్రాజెక్టు నుంచి తప్పకున్నారు.
ఇలాంటి నేపథ్యంలో ఓ పెద్ద బ్యానర్ దగ్గరకు ఈ ప్రాజెక్టు వచ్చింది. అయితే ఆ బ్యానర్ ఈ ప్రాజెక్టు ఎంత వరకు వర్కవుట్ అవుతుంది అన్న లెక్కలు వేసుకుంటోంది. ఆ బ్యానర్ ఇప్పటికే ఒక మీడియం, ఒక భారీ ప్రాజెక్టును తలకెత్తుకుంటోంది. ఇలాంటి నేపథ్యంలో ఈ ప్రాజెక్టు కూడా తీసుకుంటే సమాంతరంగా చేయగలమా? లేదా? అని ఆలోచిస్తోంది.
అది డిసైడ్ అయితే నిర్మాత దొరికేసినట్లే. లేదూ అంటే మళ్లీ వెదుకులాట ప్రారంభం అవుతుంది. అఖిల్ స్థాయిని మించిన బడ్జెట్ తో సినిమా చేయాలని సురేందర్ రెడ్డి అనుకోవడం వల్లనే ఈ ప్రాజెక్టుకు నిర్మాత దొరకడం లేదు. సరైన హిట్ అనేది ఖాతాలో లేక అఖిల్ స్ట్రగుల్ అవుతున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో ఓ సినిమా నిర్మాణంలో వుంది. ఆ సినిమానే అఖిల్ కెరీర్ ఎలా వుండబోతుంది అన్నది డిసైడ్ చేస్తుంది.