Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అఖిల్ సినిమాకు థమన్

అఖిల్ సినిమాకు థమన్

మళ్లీ మరోసారి సంగీత దర్శకుడు థమన్ హీరో అఖిల్ సినిమాకు పని చేయబోతున్నాడు. తొలి సినిమా అఖిల్ కు థమన్ గెస్ట్ కంపోజర్ గా పనిచేసాడు. మణిశర్మ బ్యాక్ గ్రవుండ్ స్కోర్ ఇచ్చాడు. ఆ తరువాత సినిమా హలోకి అనూప్ రూబెన్స్ పని చేసాడు. ఇప్పుడ మూడో సినిమా థమన్ ఫూర్తిస్థాయిలో పనిచేయబోతున్నాడు.

మహానుభావుడు సినిమాతో థమన్ సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభమైంది. అన్నీ హిట్ లు కొడుతున్నాడు. రీసెంట్ గా తొలిప్రేమ మంచి పేరు తీసుకువచ్చింది. భాగమతి బ్యాక్ గ్రవుండ్ స్కోర్ కు మంచి అప్లాజ్ వచ్చింది.

తొలిప్రేమ సినిమా అందించిన డైరక్టర్ వెంకీ అట్లూరి తన మలి సినిమాను అదే బ్యానర్ లో హీరో అఖిల్ తో చేయబోతున్నాడు. ఈ సినిమాకు కూడా థమన్ నే సంగీతం అందిస్తున్నాడు. ఈ విషయాన్ని వెంకీ అట్లూరి తన ట్విట్టర్ హ్యాండిల్ లో షేర్ చేసుకున్నాడు.

అఖిల్ తో థమన్ పూర్తి స్థాయిలో పనిచేయడం ఇదే తొలిసారి. మరి ఎలాంటి పాటలు ఇస్తాడో చూడాలి. ఈ సినిమాకు ఇంకా పనుల ప్రాధమిక స్థాయిలోనే వున్నాయి. లైన్ మాత్రం ఓకె అయింది. స్క్రిప్ట్ రెడీ అవ్వాలి. ప్రీ పొడక్షన్ పనులు జరగాలి. అప్పుడు సెట్ మీదకు వెళ్తుంది. ఈ సినిమా బహుశా ఈ ఏడాది చివరికి రెడీ అవుతుందేమో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?