అఖిల్ ఎంట్రీ అత‌నితోనే

సిసింద్రీకి ద‌ర్శకుడు దొరికాడు!  అఖిల్‌కి త‌గిన క‌థ కోసం ఇన్నాళ్ల నుంచి జ‌రుగుతున్న అన్వేష‌ణ‌కు తెర‌ప‌డింది. అఖిల్ చేత క‌థానాయ‌కుడిగా తొలి అడుగు వేయించే బాధ్యత‌… దేవాక‌ట్టాకి ద‌క్కిన‌ట్టు అత్యంత విశ్వస‌నీయ వ‌ర్గాల స‌మాచార‌మ్‌.…

సిసింద్రీకి ద‌ర్శకుడు దొరికాడు!  అఖిల్‌కి త‌గిన క‌థ కోసం ఇన్నాళ్ల నుంచి జ‌రుగుతున్న అన్వేష‌ణ‌కు తెర‌ప‌డింది. అఖిల్ చేత క‌థానాయ‌కుడిగా తొలి అడుగు వేయించే బాధ్యత‌… దేవాక‌ట్టాకి ద‌క్కిన‌ట్టు అత్యంత విశ్వస‌నీయ వ‌ర్గాల స‌మాచార‌మ్‌. అఖిల్ తొలి సినిమాకి ద‌ర్శకుడు ఎవ‌రు..??  అనే ప్రశ్న త‌లెత్తిన‌ప్పుడు వినిపించిన పేర్లలో దేవాక‌ట్టా ఒక‌టి. 

అయితే ఆమ‌ధ్య అఖిల్ మాత్రం `ఇప్పటి వ‌ర‌కూ ఏ ద‌ర్శకుడినీ అనుకోలేదు…` అని స్పష్టంగా చెప్పినా… దేవాక‌ట్టా – నాగార్జునల మ‌ధ్య క‌థాచ‌ర్చలు జ‌రుగుతూనే ఉన్నాయి. ఎట్టకేల‌కు దేవా చెప్పిన లైన్ నాగార్జున‌కు న‌చ్చడంతో ఈ కాంబినేష‌న్ లైన్ లోకి వ‌చ్చింది. నిజానికి దేవాక‌ట్టా నాగార్జున‌తో ఓ సినిమా చేయాల‌ని అనుకొన్నాడు.

కానీ చైతూతో జ‌త‌క‌ట్టి… ఆటోన‌గ‌ర్ సూర్య ప్రాజెక్ట్ టేక‌ప్ చేయాల్సివ‌చ్చింది. ఈ సినిమా అవుట్‌పుట్ ప‌ట్ల సంతృప్తి వ్యక్తంచేసిన నాగ్‌…. ఈ ద‌ర్శకుడికి మ‌రో అవ‌కాశం ఇచ్చాడు. ఆటోన‌గ‌ర్ సూర్య బ‌య‌ట‌కు రాకుండానే ఈ క్రేజీ ఆఫ‌ర్ ద‌క్కించుకొన్నాడంటే.. గ్రేటేమ‌రి..!