ధ‌నుష్ పెద‌వి అందుకొంది

తెలుగులో ఎన్ని సినిమాలు చేసినా దీక్షాసేథ్‌కి క‌ల‌సి రాలేదు. ర‌వితేజ‌, గోపీచంద్ స‌ర‌స‌న న‌టించినా గుర్తింపు రాలేదు. ఇప్పుడు ఆమె చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. అయితేనేం.. బాలీవుడ్‌లో ఆఫ‌ర్ అందుకొంది.…

తెలుగులో ఎన్ని సినిమాలు చేసినా దీక్షాసేథ్‌కి క‌ల‌సి రాలేదు. ర‌వితేజ‌, గోపీచంద్ స‌ర‌స‌న న‌టించినా గుర్తింపు రాలేదు. ఇప్పుడు ఆమె చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. అయితేనేం.. బాలీవుడ్‌లో ఆఫ‌ర్ అందుకొంది. అర్మాన్ జైన్ స‌ర‌స‌న ఓ చిత్రంలోన‌టిస్తోంది. 

అటు త‌మిళంలోనూ ఛాన్సులొస్తున్నాయి. ధ‌నుష్ స‌ర‌స‌న ఓ సినిమాలో న‌టించ‌డానికి అంగీక‌రించింది దీక్ష. ఈ సినిమాకి గానూ… ఆమె భారీ మొత్తంలో పారితోషికం అందుకొంద‌ట‌. తెలుగులో పేరున్న హీరోల ప‌క్కన న‌టించింది అనేది ఒక కార‌ణ‌మైతే, ధ‌నుష్ చిత్రంలో లిప్ లాక్కు స‌న్నివేశాల్లో న‌టించేందుకు స‌ముఖ‌త వ్యక్తం చేసినందుకు మ‌రికొంత‌… అందాయ‌ట‌. 

దాంతో తెగ ఖుషీ అయిపోతుంది ఈ అమ్మడు. “నా కెరీర్ ఇప్పుడిప్పుడే మొద‌లైంది. తెలుగు, త‌మిళ‌, హిందీ అంటూచ‌క్కర్లు కొట్టడం సంతోషంగా ఉంది. ధ‌నుష్ లాంటి స‌హ‌జ న‌టుడితో సినిమా చేయ‌డం.. సంతోషాన్నిస్తోంది.“ అంటూ సంబ‌ర‌ప‌డిపోతోంది. లిప్‌లాక్‌ల గురించి అడిగితే మాత్రం… `సినిమా అన్నాక ముద్దులుండ‌వా ఏంటి??“ అని గ‌డుసుగా స‌మాధానం చెబుతోంది.