Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అఖిల్ కు డైరక్టర్ కావలెను

అఖిల్ కు డైరక్టర్ కావలెను

అఖిల్ సినిమా తరువాత మరో సినిమా చేయాలని ఇప్పుడిప్పుడే రెడీ అవుతున్నాడు అక్కినేని అఖిల్. కానీ సమస్య అల్లా డైరక్టర్ ఎవరు అనే దగ్గరే వస్తోంది. ఫామ్ లో వున్న డైరక్టర్ ఒక్కరంటే ఒక్కరు కనిపించడం లేదు. బోయపాటి, త్రివిక్రమ్, కొరటాల శివ, సుకుమార్ సినిమాలతో బిజీ గా వున్నారు. పూరి ని తీసుకోవాలా వద్దా అన్న మీమాంస. ఇక మిగిలిన వారంతా ఒక్కో డిజాస్టర్ తొ ఖాళీగా వున్నవారే. 

దేవా కట్టా,శేఖర్ కమ్ముల, కరుణాకర్, ఇలా జాబితా చాలా మందే వున్నారు కానీ, వాళ్ల ట్రాక్ రికార్డు ఛూస్తే అనుమానం. అందువల్లనే ఇద్దరు నిర్మాతలు రెడీగా వున్నా, అఖిల్ ఊ అనలేకపోతున్నాడట. సరైన డైరక్టర్ దొరికితే, పిలిచి సబ్జెక్ట్ రెడీ చేయమని అనవచ్చు. కానీ అదే జరగడం లేదు. 

మణిరత్నం అని కూడా అనుకున్నారు కానీ మళ్లీ ఆగిపోయారు. లింగుస్వామి అయితే ఎలా వుంటుందీ అని ఓ ఆలోచన. ఆఖరికి పూరి జగన్నాధ్ నే ఆప్షన్ అయ్యేలా కనిపిస్తోంది. లోఫర్ కనుక హిట్ అనిపించుకుంటే, పూరికి పిలుపు వస్తుంది. లేదంటే లేదు. మొత్తానికి ఈ అఖిల్ డైరక్టర్ హంట్ ఎప్పటికి పూర్తవుతుందో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?