‘భలే మంచి’ లక్కీ హ్యాండ్

బాహుబలి నుంచి టర్న్ అయింది నిర్మాత, ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు టైమ్. డిస్ట్రిబ్యూషన్ లో అన్నీ హిట్ లే. పైగా చిన్న సినిమాలను ఓపిగ్గా వెదకడం, చూడడం, జడ్జ్ చేసి, కొనడం..డబ్బులు మింట్…

బాహుబలి నుంచి టర్న్ అయింది నిర్మాత, ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు టైమ్. డిస్ట్రిబ్యూషన్ లో అన్నీ హిట్ లే. పైగా చిన్న సినిమాలను ఓపిగ్గా వెదకడం, చూడడం, జడ్జ్ చేసి, కొనడం..డబ్బులు మింట్ చేసుకోవడం అదీ కార్యక్రమం. ఇప్పుడు లేటెస్ట్ గా భలే మంచి రోజు సినిమాను చూసాడు. 

చూడ్డమేమిటి..వెంటనే నైజాం ఏరియాకు అడ్వాన్స్ చేతిలో పెట్టేసాడు. నిజానికి నిర్మాతలకు డిస్ట్రిబ్యూషన్ రంగంలో మంచి సర్కిల్ వుంది. అందువల్ల పంపిణీ అన్నది సమస్య కాదు.కానీ దిల్ రాజు లాంటి లక్కీ హ్యాండ్ తోడయితే అది మరింత ప్లస్ అవుతుంది.  

సుధీర్ బాబు నటించిన ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్ సంపాదించింది. కొత్త నిర్మాతలు విజయ్ కుమార్ రెడ్డి, శశిథర్ రెడ్డి నిర్మిస్తున్నారు. కొత్త దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకువస్తుంది.