అఖిల్ అక్కినేని బ్యాచులర్ సినిమా సెట్ మీద వుంది. తరువాత సినిమా గ్యాసిప్ ల్లో నలుగుతోంది. డైరక్టర్ ఫిక్స్. సురేందర్ రెడ్డి. మరి సురేందర్ రెడ్డి లాంటి మంచి డైరక్టర్ ఫిక్స్ అయిన తరువాత కూడా అఖిల్ సినిమాకు నిర్మాత మాత్రం ఎందుకు దొరకడం లేదు. ఇక్కడ భలే గమ్మత్తయిన గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి.
సురేందర్ రెడ్డి నిర్మాత బన్నీ వాస్ కు మంచి మిత్రుడు. అఖిల్ తో బన్నీవాస్ సినిమా నిర్మిస్తున్నారు. మళ్లీ అదే అఖిల్ తో తనకు మిత్రుడు అయిన సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో సినిమా నిర్మించే అవకాశం వున్నా, ఆయన దానిని వాడుకోకుండా మరో నిర్మాత అనిల్ సుంకరకు సూచించినట్లు బోగట్టా.
సాధారణంగా మంచి కాంబినేషన్ వస్తే టక్కున పట్టేసుకుంటారు ఎవరైనా. అఖిల్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమా తీయకూడదని ఏమీ లేదు. పైగా సురేందర్ రెడ్డి. కానీ మరి ఎందుకో బన్నీ వాస్ మాత్రం ఈ ప్రాజెకును అనిల్ సుంకర కోర్టులోకి తొసారని తెలుస్తోంది.
అనిల్ సుంకర ఇప్పుడు ఈ ప్రాజెక్టును తన మిత్రులు అయిన 14రీల్స్ బ్యానర్ కు సెట్ చేయాలని చూస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అనిల్ సుంకర చేతిలో రెండు మూడు ప్రాజెక్టులు వున్నాయి. అందువల్ల ఇప్పుడు ఈ ప్రాజెక్టు చేయడం కష్టం అవుతుందని, అందుకే తన ఫ్రెండ్లీ బ్యానర్ కు దీనిని రికమెండ్ చేస్తున్నారని తెలుస్తోంది.
కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే, అసలు ఇలాంటి ఆలోచనే తమకు లేదని 14రీల్స్ ప్లస్ బ్యానర్ ఓనర్లు చెబుతున్నట్లు తెలుస్తోంది. తమ దృష్టిలో ఇలాంటి ఆలోచన లేదని, ఇది ప్యూర్ గ్యాసిప్ అని అంటున్నారు. అంతే కానీ ఇలాంటి ప్రాజెక్టు వస్తే వదులుకుంటామా? అని అనడం లేదు.
నిజానికి ఈ రోజుల్లో ఎక్కడ కాంబినేషన్ దొరుకుతుందా? ఎక్కడ ప్రాజెక్టు దొరకుతుందా? అని నిర్మాతలు చూస్తున్నారు. కానీ ఇలాంటి టైమ్ లో అఖిల్ అక్కినేని ప్రాజెక్టును ఇలా ఒక్కొక్కరు, మరొకరి కోర్టులోకి ఎందుకు తోయాలని చూస్తున్నారో? సైరా సినిమా తరువాత సురేందర్ రెడ్డి తో సినిమా అంటే అంత అనుమానంగా వుందా? ఏమో? ఏమైనా సురేందర్ రెడ్డి ఐడియాలకు, బడ్జెట్ లకు పెద్ద హీరోలు తప్ప, అఖిల్ లాంటి చిన్న హీరోలు లాభంలేదు. వాళ్ల మీద ముఫై, నలభై కోట్లు వర్కవుట్ కావడం కష్టం.బహుశా అదే ఈ దోబూచులాటకు కారణం కావచ్చు.