అఖిల్ సరసన కొత్త హీరోయిన్

హిట్ టార్గెట్ గా ఇటు గీతా2 అటు బొమ్మరిల్లు భాస్కర్ కలిసి పట్టుదలగా తయారుచేసిన స్క్రిప్ట్ తో సినిమా స్టార్ట్ అయింది హీరో అఖిల్ కోసం. ఈ స్క్రిప్ట్ ను దాదాపు ఏడాది కాలంగా…

హిట్ టార్గెట్ గా ఇటు గీతా2 అటు బొమ్మరిల్లు భాస్కర్ కలిసి పట్టుదలగా తయారుచేసిన స్క్రిప్ట్ తో సినిమా స్టార్ట్ అయింది హీరో అఖిల్ కోసం. ఈ స్క్రిప్ట్ ను దాదాపు ఏడాది కాలంగా కూర్చుని తయారుచేసారు. అయితే షూట్ స్టార్ట్ అయింది కానీ, హీరోయిన్ కావాలి. రష్మిక అనే గ్యాసిప్ లు వచ్చాయి కానీ, అవి కరెక్ట్ కాదు.

బబ్లీగా, లవ్ లీగా, అన్నింటికి మించి తెలుగు అమ్మాయిగా కనిపించే క్యూట్ గర్ల్ కోసం వెదుకలాట సాగుతోంది. కొత్త అమ్మాయి అయితే బెటర్ అనే ఆలోచన కూడా నిర్మాత బన్నీ వాసులో వుంది. ఈ మేరకు అన్వేషణ సాగుతోంది.

అలాంటి అమ్మాయి దొరికితే సినిమా షూట్ స్పీడ్ అందుకుంటుంది. ఇదిలావుంటే మారుతి డైరక్షన్ లో సాయిధరమ్ తేజ్ కోసం కూడా హీరోయిన్ అన్వేషణ సాగుతోంది. అక్కడ కూడా మాళవిక శర్మ (నేలటికెట్ హీరోయిన్) పేరుతో గ్యాసిప్ లు వచ్చాయి. కానీ అదీ నిజం కాదు.అయితే అక్కడ మాత్రం కాస్త నోటెడ్ హీరోయిన్ కోసమే వెదుకుతున్నారు.

ఇవన్నీ ఒకటి రెండు రోజుల్లో ఫైనల్ అయిపోతాయని తెలుస్తోంది.

జగన్ పదేళ్ల రాజకీయ ప్రస్థానం అద్భుత మలుపు

కమ్మ వారి ఆత్మ ఘోష… ఆడియో కాల్..ఇంతగానా?