చంద్రబాబుకి మరో సాకు దొరికింది

నిన్నటి వరకూ ఈవీఎంలపై పడి ఏడ్చిన చంద్రబాబుకి మోడీ దెబ్బేంటో తెలిసొచ్చింది. రాష్ట్రంలో జగన్ చేతిలో తిన్న ఘోర పరాభవం మరోవైపు. అయితే టీడీపీ తిన్న చావుదెబ్బకు కారణం వెదకడంలో మాత్రం చంద్రబాబు ఇంకా…

నిన్నటి వరకూ ఈవీఎంలపై పడి ఏడ్చిన చంద్రబాబుకి మోడీ దెబ్బేంటో తెలిసొచ్చింది. రాష్ట్రంలో జగన్ చేతిలో తిన్న ఘోర పరాభవం మరోవైపు. అయితే టీడీపీ తిన్న చావుదెబ్బకు కారణం వెదకడంలో మాత్రం చంద్రబాబు ఇంకా తన మార్క్ తెలివితేటల్ని చూపిస్తున్నారు. సరికొత్త లాజిక్ ను తెరపైకి తీసుకొస్తున్నారు.

జగన్ ప్యాన్ గాలికి రాష్ట్రంలో మహామహులే కొట్టుకుపోయారు. మంత్రులంతా మట్టి కరిచారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి కొడుకే ఓడిపోయాడంటే టీడీపీపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి అర్థం చేసుకోవచ్చు. అయితే చంద్రబాబుకి మాత్రం ఈ ఓటమి మరోలా అర్థమైంది. టీడీపీపై కోపంతో ప్రజలు వైసీపీకి ఓట్లు వేయలేదట. కేవలం జగన్ పై సానుభూతితో మాత్రమే ఓట్లు వేశారట.

బాబు లాజిక్ విని టీడీపీ నేతలే నవ్వుకుంటున్నారు. జగన్ పై సానుభూతి ఉంటే.. తండ్రి మరణం తర్వాత వచ్చిన తొలి సార్వత్రిక ఎన్నికల్లోనే ఆయన గెలిచి ఉండేవారు. అప్పుడు జగన్ గెలిచి ఉంటే.. సానుభూతి పవనాలు వీచాయంటూ బాబు చెప్పే మాటను అందరూ అంగీకరించేవారు. కానీ ఇప్పుడు జగన్ పై ప్రజలకు ఎందుకు సానుభూతి ఉంటుంది, ఏ కారణం చేత జగన్ ని సెంటిమెంట్ కోణంలో చూస్తారు?

జగన్ పై ప్రజలకున్న నమ్మకాన్ని, చంద్రబాబు పొరపాటున సానుభూతిగా ఊహించుకుంటున్నారు. జగన్ కి ఎవరి సానుభూతి అక్కర్లేదు, ఆయన సామర్థ్యం, ఐదేళ్లపాటు చేసిన ప్రజా పోరాటాలు, ఎక్కడా మాట తప్పని నిజాయితీకి ప్రజలు ఆకర్షితులయ్యారు. ఆ వర్గం ఈ వర్గం అనే తేడాల్లేకుండా సమాజంలోని అన్నివర్గాలు జగన్ కి అండగా నిలిచాయి. అందుకే 151 సీట్ల భారీ విజయం జగన్ కి దక్కింది.

ఈ చారిత్రక విజయాన్ని కూడా తక్కువ చేసి చూపించేందుకు చంద్రబాబు కుయుక్తులు పన్నుతున్నారు. జగన్ చారిత్రాత్మక విజయాన్ని తన ఫెయిల్యూర్ గా కాకుండా… సానుభూతి విజయంగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. బాబు ఎంత గింజుకున్నా, తోక పత్రికలు ఎంత వక్రీకరించాలని చూసినా.. జగన్ ఉండగా చంద్రబాబు ఇక అధికారంలోకి రాలేరనేది మాత్రం వాస్తవం. దానికి ఈ విజయమే నిదర్శనం. 

జగన్ పదేళ్ల రాజకీయ ప్రస్థానం అద్భుత మలుపు

కమ్మ వారి ఆత్మ ఘోష… ఆడియో కాల్..ఇంతగానా?