హిట్ కోసం చిరకాలంగా ఎదురుచూస్తున్న హీరో అఖిల్. అసలు సినిమా కోసమే చిరకాలంగా ఎదురు చూస్తున్న దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్. ఈ ఇద్దరు కలిసి చేస్తున్న సినిమా చకచకా రెడీ అవుతోంది. ఈ సినిమా టైటిల్ మంగళవారం నాడు ప్రకటించబోతున్నారు.
అయితే కొన్ని నెలల క్రితమే ఈ సినిమాకు ఓ టైటిల్ గ్యాసిప్ గా వినిపించింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అన్నది ఆ టైటిల్. అయితే అప్పట్లో ఇది మరీ పెద్ద టైటిల్ అని ఒకపక్క, విజయ్ దేవర కొండ వరల్డ్ ఫేమస్ లవర్ ను ఇమిటేట్ చేసినట్లు వుంటుంది అని ఇంకో పక్క కామెంట్లు వినిపించాయి. కానీ అసలు టైటిల్ మాత్రం బయటకు రాలేదు.
ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు బయటకు రాబోతున్న టైటిల్ అదే అంటూ మళ్లీ గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. 'మోస్ట్ ఎలిజిబుల్ అన్నవి చిన్న లెటర్స్ గా, బ్యాచులర్ అన్నది పెద్ద లెటర్స్ గా లోగో వుంటుందని తెలుస్తోంది. ఈ టైటిల్ అలా వుంచి మరేదైనా మంచి టైటిల్ దొరకుతుందా అన్న ఆలోచనలు చేస్తున్నారని, కానీ ఇదే బాగుందనే ఆలోచనతోనూ, యూత్ కు ఇలాంటివే పడతాయన్న ఉద్దేశంతోనూ అదే విడుదల చేస్తారని వినిపిస్తోంది.
ఇటు అఖిల్ కు, అటు భాస్కర్ కు ఈ సినిమా విజయం అవసరం. కచ్చితంగా హిట్ కొట్టి తీరాలి. లేదూ అంటే పరిస్థితి చాలా తేడాగా వుంటుంది. అయితే ప్రతి రోజూ పండగే, అల వైకుంఠపురములో సినిమాలతో సకెస్ బాటలో వున్న గీతా సంస్థ అఖిల్ కు భాస్కర్ కు కూడా హిట్ ఇస్తుందనే నమ్మకం, సెంటిమెంట్ బలంగా వుంది.