ఆర్నెల్లు సహవాసం చేస్తే, వారు వీరు అవుతారని సామెత. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాప్ డైరక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మంచి దోస్త్ లు. ఒకరు ఆత్మ..మరొకరు పరమాత్మ టైపు. అందుకే ఇద్దరూ ఇప్పుడు ఒక్కలాగే బిహేవ్ చేస్తున్నారని వినికిడి.
పవన్ కు మరో సన్నిహితుడు శరద్ మురార్. ఆయన గబ్బర్ సింగ్ 2 నిర్మాత. ఆ సినిమా ఇలా ఫస్ట్ షెడ్యూలుకు వెళ్లి అలా తిరిగి వచ్చింది. అసలు షెడ్యూలు ప్రారంభం కావాల్సి వుంది. కానీ ఎప్పుడు అన్నది తెలియదు. పవన్ ఎప్పుడు పిలిచి చెపితే అప్పుడు. సన్నిహతుడైనా శరద్ మురార్ అడిగేంత సీన్ లేదు.
అలాగే దర్శకుడు త్రివిక్రమ్ కు సన్నిహితుడు నిర్మాత రాధాకష్ణ (చిన్నబాబు) త్రివిక్రమ్ తన తరువాత సినిమాకు హీరోను డిసైడ్ చేయలేదు. నితిన్ నా, నాగ్ చైతన్య అన్నది త్రివిక్రమ్ ఓ ముక్క చెబితే, తన ప్లాన్ లు చేసుకోవాలని చిన్నబాబు అయిడియా. అయినా ఆయన చెప్పేవరకు ఆగాల్సిందే. అడగడానికి లేదు. ఆయన ఎప్పడు చెబుతాడో తెలియదు. మరో రెండురోజుల వరకు ఇది తేలదని బోగట్టా.
ఒక వేళ నాగచైతన్య కాదు, నితిన్ అని చెప్పినా, ఇప్పటికిప్పుడు చందు మొండేటి సినిమా పట్టాలెక్కిపోదు. కనీసం నెలన్నా పడుతుంది. ఎందుకంటై త్రివిక్రమ్ పుణ్యమా అని పాపం ఆ వర్థమాన డైరక్టర్ సినిమా పక్కన కూర్చుంది ఏ ప్లానింగ్ చేయకుండా, ఈయన డిసైడ్ అయితే అప్పుడు అక్కడి సంగతి.