తొలి సినిమా ఫ్లాప్ అవడంతో, రెండో సినిమా విషయంలో అఖిల్ ఇంకా కన్‌ఫ్యూజన్ నుంచి బయటకు రావడంలేదు. ఈ గ్యాప్‌ని అక్కినేని అభిమానులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. నెలల వయసులోనే 'సిసింద్రీ'గా సూపర్ హిట్ కొట్టేసిన అఖిల్, మంచి డాన్సులతో.. సూపర్ యాక్షన్‌తో చేసిన 'అఖిల్' సినిమా విషయంలో మాత్రం ఫెయిల్యూర్ చవిచూశాడు.
నాగచైతన్య విషయంలో కూడా మొదట్లో నాగార్జున ఇంతగా హర్ట్ అయి వుండడమే. 'అఖిల్' తర్వాత నాగ్, తన కుమారుడు అక్కినేని అఖిల్ కెరీర్ విషయంలో చాలా జాగ్రత్తపడ్డాడు. కాస్త లేటయితే రీ-లాంఛ్ అని అయినా అనుకోవచ్చుగానీ, ఇంకో ఫ్లాప్ చవిచూస్తే, కెరీర్ అటకెక్కిపోవడం ఏమాత్రం మంచిది కాదన్న భావనతో వున్నాడు అక్కినేని నాగార్జున. అందుకే, యువ దర్శకులు, స్టార్ దర్శకుల నంచి కథలు వింటున్నాడు.. వింటూనే వున్నాడు.
ఇక, ఈ మధ్యనే 'మనం' తరహాలో ఓ కథ విన్నాడట నాగార్జున. 'మనం'తో అస్సలేమాత్రం పోలిక లేకపోయినా, ఆ సినిమాల్లో వున్నంత ఫీల్‌తోపాటు, అంతకు మించిన ఎంటర్‌టైన్‌మెంట్, రొమాన్స్, యాక్షన్‌కి ఈ కథలో బోల్డంత స్కోప్ వుందట. అయితే, యువ దర్శకుడు ఒకరు ఈ కథ తీసుకురావడంతో నాగార్జున ఛాన్స్ తీసుకోవడంపై ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్, ఇంకొందరు దర్శకులతో తొలుత ప్లాన్ చేసినా, నాగార్జున రిస్క్ చేసేసి.. కొత్త డైరెక్టర్‌తోనే చేసేద్దాం.. అనే నిర్ణయానికి దాదాపుగా వచ్చేశాడట. ఆ చిన్న కన్‌ఫ్యూజన్ తగ్గితే అతి త్వరలో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశముంది. సినిమాలో తన పాత్ర నిడివి తక్కువ వుండేలా, చైతూ – అఖిల్‌ల పాత్రలు తెరపై అద్భుతంగా వుండేలా స్క్రిప్ట్‌లో చిన్న చిన్న మార్పులు చేయించే పనుల్లో నాగ్ బిజీగా వున్నాడట. ఏమో, నాగ్ వేస్తున్న ఈ సూపర్ స్కెచ్ ఏ మేరకు వర్కవుటవుతుందో వేచి చూడాల్సిందే.