తెలుగు సీమలో ఉద్దండులైన హాస్యనటులకు కొదవలేదు. అందులో పద్మశ్రీలూ ఉన్నారు. అల్లురామలింగయ్య, బ్రహ్మానందంలకు పద్మ వరించింది. ఇప్పుడు అలీ కూడా పద్మశ్రీ అయ్యేవాడే. కానీ తృటిలో ఈ పురస్కారం తప్పింది.
రాష్ట్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డులకు సిఫార్సు చేస్తూ కేంద్రానికి ఓ జాబితా పంపింది. అందులో అలీ పేరు కూడా ఉంది. అలీ కూడా తన వంతుగా పద్మ అవార్డు కోసం కృషి చేసినట్టు సమాచారమ్. అయితే సరైనంత పుషప్ అలీకి లభించలేదు.
దానికి తగ్గట్టు అలీ పేరు అవార్డుల జ్యూరీ పక్కన పెట్టింది. దాంతో అలీకి పద్మ మిస్సయ్యింది. ఇప్పుడు పక్కన పెట్టినా ఏదో ఒక రోజు అలీకి తప్పకుండా ఈ పురస్కారం లభించి తీరుతుందని కొంతమంది జోస్యం చెబుతున్నారు. ఇంతకీ అలీకి పద్మశ్రీ ఇవ్వాల్సిందేనంటారా..?.