మారుతి సినిమా అంటే ఓ ముద్ర పడిపోయింది. ఈరోజుల్లో అంటే.. ఏదో నిలబడడానికి, యూత్‌ని టార్గెట్ చేస్తూ ఓ సినిమా తీశాడనుకోవచ్చు. బస్ స్టాప్‌లోనూ అదే తంతు. పోనీ ఆ జోనర్ నుంచి బయట పడలేదనుకొంటే.. ఆ తరవాత వచ్చిన రొమాన్స్, ఇప్పటి లవ్ యూ బంగారం కూడా మారుతి మారలేదు, మారబోడు అనే విషయాన్ని గట్టిగా చెప్పే ప్రయత్నం చేశాయి.
బహుశా ఈ రెండు సినిమాలకూ దర్శకుడు మారుతి కాకపోవచ్చు. కానీ దర్శకత్వం విషయంలో మారుతి జోక్యం ఉంటుందనేది నిర్వివాదాంశం. ప్రేమకథా చిత్రమ్ సినిమాకీ మారుతి నిర్మాత మాత్రమే. జె. ప్రభాకర్ రెడ్డి దర్శకుడు.ఈ సినిమా హిట్టయ్యేసరికి క్రెడిట్ మొత్తం సింగిల్ గా కొట్టేశాడు మారుతి.
ఆ సినిమాకి నిజమైన దర్శకుడు తానేనని, ప్రభాకర్‌రెడ్డి ఏమీ చేయలేదని స్టేట్మెంట్లు ఇచ్చాడు. రొమాన్స్, లవ్ యూ బంగారం విషయంలో మాత్రం నేను కేవలం నిర్మాతని మాత్రమే అంటున్నాడు. అంటే హిట్టయితే ఆ పుణ్యం తాను తీసుకొని, ఫ్లాప్ అయితే ఆ పాపం మరొకరికి అంటగడతాడా..? ఇదేం న్యాయం?!