గుణశేఖర్ రుద్రమదేవి విషయంలో ప్రేక్షకులకు మరో సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమాలో ఒకొక్క స్టార్‌కీ చోటిస్తూ… కాస్టింగ్‌తో నింపేస్తున్న గుణశేఖర్ మరో హీరోని రుద్రమదేవిలో దింపుతున్నాడు. ఆ హీరో ఎవరో కాదు… రవితేజ. ఔను. రుద్రమదేవిలో రవితేజ నటించబోతున్నట్టు వార్తలొస్తున్నాయి.
రవితేజ, గుణశేఖర్‌ల మధ్య ఉన్న స్నేహం కూడా ఈ సినిమాలో రవితేజ ఎంట్రీకి ఓ కారణమయ్యాయి. ఈ చిత్రంలో రాకుమారుడి పాత్ర ఉంది. దాని కోసం మహేష్ ను సంప్రదించినట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే ఆ పాత్ర ఇప్పుడు రవితేజకు దక్కినట్టు తెలుస్తోంది.
సినిమా మొత్తమ్మీద దాదాపు 15 నిమిషాల పాటు కనిపించే పాత్ర ఇది. కథలో కీలకం కూడా. మరి ప్రిన్స్ గా రవితేజ ఎంతలా మెప్పిస్తాడో చూడాలి. అయితే రవితేజ ఎంట్రీ విషయాన్ని చిత్రబృందం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.