ఆరడుగుల అందగాడు కాదు, అమెరికా చదువులు లేవు
చెప్పులు లేని కాళ్ళు తిరిగాయీ గుడివాడ వీధుల లోగిళ్ళు
రామపురం నుంచి సాగిన ప్రయాణం … చేరింది హస్తినాపురం
“పద్మా ” లన్ని కోరి వచ్చి , చేసాయి నిన్ను నటన కు కలికితురాయి
ముక్కు సూటిగా మాటలాడే తత్వం ,
నిండిన మానవీయతే నీ సొంతం’
నిష్కర్ష గా ,నిక్కచ్చిగ మాట్లాడటమే నీకు తెలిసిన నిజం
అందుకే నీది మడతలు లేని మనసు ,ముడతలు లేని సొగసు
నీ నటనా విశ్వరూపం , తెలుగు కళామతల్లి నుదుటి తిలకం
తెలుగు తెరకు నేవు అందిచ్చిన చిత్ర కళాఖండాలు
ఆంధ్ర ప్రేక్షకులు కల కాలం దాచుకునే తీపి గుర్థులు
నీవు లేక అయ్యింది, తెలుగు చిత్రసీమ ,కళ్ళు లేని కబోది
“ప్రేమలోని మాధుర్యం” చూపిన రాజు, తెలుస్తుంది చూస్తే “బాలరాజు”
“కలిమిలేమికి, ,కావడి కుందలకు” దైర్యం నేర్పిన బాసు, ఆంధ్రుల కిచ్చిన మందే “దేవదాసు”
“చేతిలో చెయ్యేసి చెప్పిన పిల్లడు” , మన తెలుగు వాళ్ళ “దసరాబుల్లోడు’
“టాటా వీడుకోలు గుడ్ బై ఇంక సెలవు “ అంటూ వెళ్ళాడు మన “బుద్ధిమంతుడు”
ప్రపంచానికి నాస్తికుడు, కాని వేదాంత సారంలో అగస్త్యుడు
మనోనిబ్బరం , క్రమశిక్షణ లలో ,మేరు నగదీరుడు
చలన చిత్ర విలీనాకశములో , ధ్రువ తార వయ్యావు అక్కినేని !!!
ఓ !!!!! బహుదూరపు బాటసారి!!! , రోదిస్తున్నాయి తెలుగు “మూగ మనసులు”
-మరవదొయి నిన్ను, ఎన్నటికి మా వెన్నెల గోదారి!!!
-శ్యామ్ సుందర్ కాట్రపాటి ,sylvania, Ohio,USA