సూప‌ర్ హిట్ సీక్వెల్‌.. గ‌ప్‌చుప్‌గా

ఎస్వీ కృష్ణారెడ్డి మ‌ళ్లీ మెగాఫోన్ ప‌ట్టారు. య‌మ‌లీల 2 మొద‌లెట్టేశారు. ఈ సినిమాలో  య‌ముండ అని గ‌ర్జిస్తోంది…. క‌లెక్షన్ కింగ్ మోహ‌న్‌బాబు. మోహ‌న్‌బాబు, బ్రహ్మానందం ఈ సినిమాలో ప్రధాన పాత్రధారులు. మిగిలిన‌వాళ్లంతా కొత్తవారే. ఓ…

ఎస్వీ కృష్ణారెడ్డి మ‌ళ్లీ మెగాఫోన్ ప‌ట్టారు. య‌మ‌లీల 2 మొద‌లెట్టేశారు. ఈ సినిమాలో  య‌ముండ అని గ‌ర్జిస్తోంది…. క‌లెక్షన్ కింగ్ మోహ‌న్‌బాబు. మోహ‌న్‌బాబు, బ్రహ్మానందం ఈ సినిమాలో ప్రధాన పాత్రధారులు. మిగిలిన‌వాళ్లంతా కొత్తవారే. ఓ సూప‌ర్ హిట్ సీక్వెల్ ఇంత గ‌ప్‌చుప్‌గా మొద‌లెట్టేయండం కాస్త విచిత్రమే. 

కృష్ణారెడ్డి స్నేహితుడు, స‌న్నిహితుడు అచ్చిరెడ్డి ఈ సినిమాకి నిర్మాత‌. గ‌త కొన్నేళ్లుగా సినిమా ద‌ర్శక‌త్వంపై ఏమాత్రం ఆస‌క్తి చూపించ‌డం లేదు కృష్ణారెడ్డి. ఈసారి హిట్ కొడ‌తా.. అన్న న‌మ్మకం వ‌చ్చిన‌ప్పుడే సినిమా మొద‌లెడ‌తా అని చెప్తుండేవారు. 

ఇప్పుడు య‌మ‌లీల 2 తీస్తున్నారంటే ఈ క‌థ‌పై ఆయ‌న కాన్ఫిడెన్స్ లెవిల్ కూడా పెరిగి ఉండేది. అలీ పాత్రలో న‌రేష్‌ని తీసుకొంటార‌నే ప్రచారం జ‌రిగింది. అయితే… కొత్తవారితో తీయ‌డం మాత్రం ఆస‌క్తిరేకెత్తిస్తోంది.