రామ్ చరణ్ కు మగధీర, ఆర్ఆర్ఆర్, ప్రభాస్ కు బాహుబలి, ఎన్టీఆర్ కు ఆర్ఆర్ఆర్..మరి బన్నీ అలియాస్ అల్లు అర్జున్ కు. అందుకే ఇప్పుడు పుష్ప వ్యవహారాలు అన్నీ మారిపోతున్నాయి.
బన్నీకి కూడా ఓ ల్యాండ్ మార్క్ పాన్ ఇండియా సినిమాగా పుష్పను తయారుచేసే విధంగా చర్చలు సాగుతున్నాయి. సీన్లు వండుతున్నారు. కథకు జోడిస్తున్నారు.
అందుకోసమే ఒక్క సినిమాకు సరిపడిన కథను రెండు సినిమాలకు విస్తరిస్తున్నారు. స్టయిలిష్ మాఫియా డాన్ గా ఎదిగిన ఎర్రచందనం కూలీ కథ ఆదిలో అయితే విశ్రాంతికి ముందు ఆ తరువాత. కానీ దాన్ని ఫస్ట్ పార్ట్ రెండో పార్ట్ అన్నట్లు తయారు చేస్తున్నారు.
ఏ సినిమాకు అయినా కథతో సంబంధం లేకుండా నాలుగు పాటలు, నాలుగు ఫైట్లు ఎలాగూ జోడించాలి. పుష్ప విషయంలో కూడా అదే జరుగుతోంది. తొలిసగంలో అడవిలో భారీ ఛేజ్ వుంటుందని ఇప్పటికే ప్రచారంలో వుంది. మలిసగంలో అలాంటి ఎపిసోడ్ జోడించాలన్నది ప్లాన్.
మొదటిటి అడవిలో, కొండల్లో జరిగితే ఇది నీటిలో వుండేలా. అంతే కాదు రెండు భాగాలు చేయడంతో కనీసం 250 కోట్ల బడ్జెట్ వరకు పెట్టుబడి పెట్టడానికి వీలు కలిగింది. అందువల్ల భారీతనం విషయంలో 'తగ్గేదే లే' అన్నట్లు ప్లాన్ ల మీద ప్లాన్ లు వేస్తున్నారు పుష్ప మేకర్లు.