‘రేసుగుర్రం’తో స్టార్‌గా తన రేంజ్ పెంచుకున్న అల్లు అర్జున్ తన కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ చేసాడు. తనతో జులాయి తీసిన త్రివిక్రమ్‌తో అల్లు అర్జున్ మరోసారి వర్క్ చేస్తున్నాడు. అత్తారింటికి దారేది తర్వాత త్రివిక్రమ్‌తో చేయడానికి అందరు టాప్ హీరోలు సిద్ధంగా ఉన్నా కానీ త్రివిక్రమ్ మాత్రం ఏరి కోరి బన్నీతో సినిమా చేస్తున్నాడు.
తమ ఇద్దరి కలయికలో సినిమా అంటే ఖచ్చితంగా అంచనాలు బాగుంటాయని త్రివిక్రమ్‌కి తెలుసు. బిజినెస్ పరంగా కూడా ఢోకా ఉండదు. అయినా కానీ త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తేలిగ్గా తీసుకోవడం లేదు. కథ పక్కాగా సిద్ధమయ్యాక గానీ ఈ చిత్రాన్ని స్టార్ట్ చేయలేదు. ఈమధ్య బౌండ్ స్క్రిప్ట్ రెడీ అయ్యాకే షూటింగ్ స్టార్ట్ చేస్తోన్న త్రివిక్రమ్ జులాయి, అత్తారింటికి దారేది తర్వాత మరోసారి ఫుల్ బౌండ్ స్క్రిప్ట్‌తో ఈ చిత్రం చేస్తున్నాడు.
ఈ కథ తెలిసిన వాళ్లు అల్లు అర్జున్‌కి మరో సూపర్‌హిట్ ఖాయమని అంటున్నారు. ఇందులో కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఒక కీలక పాత్ర చేస్తున్నాడు. అతను విలన్‌గా నటిస్తున్నాడని ప్రచారమైంది కానీ తనది విలన్ క్యారెక్టర్ కాదని ఉపేంద్ర స్పష్టం చేసాడు. బన్నీ సరసన తొలిసారిగా సమంత కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రం వచ్చే వేసవిలో విడుదల కానుంది.