‘ఆగడు’లాంటి భారీ అంచనాలున్న సినిమా వారం రోజుల్లో విడుదలవుతుందని తెలిసినా కానీ ‘పవర్’ని సెప్టెంబర్ 12న రిలీజ్ చేసేసారు. సెప్టెంబర్ 5నే రావాల్సిన పవర్ వారం లేట్ అయి… మంచి ఛాన్స్ మిస్ అయిందని, ఆగడు వల్ల దీనికి చాలా డ్యామేజ్ జరుగుతుందని అనుకున్నారు. కానీ పవర్ మేకర్స్ తీసుకున్న రిస్క్ అనూహ్యంగా వారికి వరమై కూర్చుంది.
విపరీతమైన ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య వచ్చిన ఆగడు అదిరిపోయే ఓపెనింగ్ సాధించినా కానీ ఫ్లాప్ టాక్‌తో దారుణంగా వీక్ అయిపోయింది. సోమవారం వసూళ్లు తెలంగాణ, ఏపీ మొత్తమ్మీద చాలా బలహీనంగా ఉన్నాయి. ఇప్పటికే ఆగడు థియేటర్లు తగ్గించి ‘పవర్’ చిత్రానికి కేటాయించారు. ఈ వీకెండ్‌లో ఆగడు ఎఫెక్ట్ వల్ల పవర్‌కి కలెక్షన్లు ఉండవని అనుకుంటే… శనివారం, ఆదివారం పవర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి.
పవర్ యావరేజ్ రేంజ్‌తో సరిపెట్టుకుంటుందేమో అనుకుంటే… ఆ సినిమా రేంజ్ పెరగడానికి కావాల్సిన ఫ్యూయల్ ఆగడు ప్రొవైడ్ చేసినట్టయింది. సోమవారం నాడే చాలా థియేటర్లలో డే డెఫిసిట్స్ పడడంతో ఆగడు భారీ నష్టాల దిశగా వెళుతోందని ట్రేడ్ వర్గాలు తెలియజెప్పాయి. కొన్ని చోట్ల జనం లేక షోస్ కూడా కాన్సిల్ చేసినట్టు వినిపిస్తోంది.