అల్లు శిరీష్ ఓకె..కానీ సునీల్ నో?

సునీల్ కు హీరోయిన్ దొరకడం లేదు. మారుతి దర్శకత్వంలో సునీల్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇందుకోసం సునీల్ మూడు కోట్లు అడుగుతున్నాడు. కానీ సరైన హీరొయిన్ కావాలంటే బడ్జెట్ దాటిపొతుందని,…

సునీల్ కు హీరోయిన్ దొరకడం లేదు. మారుతి దర్శకత్వంలో సునీల్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇందుకోసం సునీల్ మూడు కోట్లు అడుగుతున్నాడు. కానీ సరైన హీరొయిన్ కావాలంటే బడ్జెట్ దాటిపొతుందని, అందువల్ల సునీల్ రెండు కోట్లు చేసుకుంటే, మరో ఒకటి ఖర్చుచేసి సరైన హీరొయిన్ ను తెస్తామని అంటున్నారు దర్శక నిర్మాతలు. కానీ దానికీ సునీల్ నో అంటున్నాడు. 

ఆ సంగతి అలా వుంచితే, తాను కొత్తజంటలో మాంచి అవకాశం ఇచ్చాను కదా అని మారుతి రెజీనాను అడిగితే, కథ విని ఓకె అని, ఆ తర్వాత సునీల్ అనగానే నో అనేసిందట. అదేం చిత్రమో, సునీల్ అంటే అందరు హీరోయిన్లు ఆమడ దూరం పోతున్నారు. రెజీనా అల్లు శిరీష్ పక్కన మరో సినిమా కావాలంటే చేస్తా కానీ, సునీల్ అంటే నో అందట. చిత్రమే.