చంటిగాడు నుంచి లవ్లీ దాకా కాస్త నీట్ గా వుండే చిన్న సినిమాలు తీస్తూ వచ్చిన, దర్శకురాలు ఆర్ జయ, మరో కొత్త సినిమాకు శ్రీకారం చుడుతున్నారు. ఈ సారి అందరూ కొత్తవాళ్లతో సినిమా తీస్తారట. అందుకోసం త్వరలో టాలెంట్ హంట్ ప్రారంభిస్తున్నట్లు సమాచారం.
కేవలం నటీనటులే కాకుండా, పాటల రచయితకు కూడా కొత్తవారికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారట. వెస్ట్,.ఈస్ట్, విశాఖ జిల్లాల్లో షూటింగ్ జరిపే ఈ సినిమా జూలైలో ప్రారంభమయ్యే అవకాశం వుంది. అయితే మ్యూజిక్ డైరక్టర్ గా మాత్రం లవ్ లీకి మాంచి లవ్లీ మ్యూజిక్ ఇచ్చిన అనూప్ రూబెన్స్ నే ఎందుకున్నట్లు తెలుస్తోంది. సినిమా పేరు తాత్కాలికంగా 'తొక్కుడుబిళ్ల' అని నిర్ణయించేసుకున్నారు. ఔత్సాహికులు ఛలో జయ ఆఫీస్.