సునీల్ తో భక్త కన్నప్ప సినిమా తీయాలన్నది రచయిత,నటుడు, దర్శకుడు భరణి సంకల్పం. అయితే దాన్ని తనదైన స్టయిల్ లో తీయాలనుకున్నాడు. అచ్చమైన ఓ ఆటవికుడు, అమాయకుడు, మొరటువాడు, భక్తి ముదిరినవాడు..ఇలాంటి లక్షణాలతో కానీ మన సునీల్ మాత్రం కన్నప్పకు కూడా హీరోయిజం వుండాలని, డ్యూయట్లు అవసరమని చెప్పకొచ్చాడు.
Advertisement
స్క్రిప్టును తన చిత్తానికి మార్చాలని చూసాడని వినికిడి. దీంతో భరణి ప్రస్తుతాని ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేసినట్లు తెలుస్తోంది. సునీల్ తన స్క్రిప్ట్ ను యథాతంగా ఓకె అంటేనే చేస్తానని అంటున్నాడట.