అల్లువారింట ఈ రోజు భలే సందడిగా వుంది. ఆ ఇంటి అల్లుడు మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే కావడమే విశేషం. చాలా కాలంతరువాత మెగాస్టార్ బర్త్ డే హడావుడి అల్లు వారింట జరుగుతోంది.
గత కొంతకాలంగా అటు అల్లు ఫ్యామిలీ, ఇటు మెగా ఫ్యామిలీ మధ్య బంధాలు వున్నాయి అంటే వున్నాయి. లేవు అంటే లేవు. అన్న టైపులో కొనసాగాయి. బన్నీ-పవన్ మధ్య, బన్నీ-చరణ్ ల మధ్య అంతగా సయోధ్య వుండేది కాదు. ఇది వాస్తవం.
బన్నీ మనుషులు అనుకునేవారు ఎవరూ, తమ దగ్గర వుండకూడదని అనుకున్నాడు చరణ్ ఓ దశలో. ఒక్క అరవింద్-చిరంజీవి ల మధ్య మాత్రం సంబంధాలు కాస్త రెస్పెక్టబుల్ గా కొనసాగాయి. అయితే మరీ అద్భుతంగా మాత్రం కాదనన్నది మెగా ఫ్యామీలీకి, అల్లు ఫ్యామిలీకి దగ్గరగా వున్నవాళ్లు చెప్పే మాట.
అయితే ఇటీవల టోటల్ మెగా ఫ్యామీలు అన్నీ ఒక్కటయ్యాయి. పవన్ కళ్యాణ్ మీద శ్రీరెడ్డి మాటల దాడి నేపథ్యంలో జరిగిన పరిణామాలు అన్నీ బాగా పనిచేసాయి. మొత్తం మెగాఫ్యామిలీ ఒకటయింది. బన్నీ కోసం మెగా హీరోలు, మెగా హీరోల కోసం బన్నీ అంతా ఒక తాటిపైకి వచ్చారు.
ఇలాంటి నేపథ్యంలో గీతా సంస్థకు గీత గోవిందం లాంటి మెగా హిట్ వచ్చింది. దీంతో అల్లు అరవింద్ కు వెయ్యి ఏనుగుల బలం వచ్చింది. గడచిన వారం రోజులుగా అల్లు అరవింద్ ను సన్నిహితంగా చూస్తున్నవారు ఆయనలో గీతగోవిందం హిట్ చాలా మార్పు తెచ్చిందని అంటున్నారు. ఆ హుషారుతోనే ఈ రోజు అరవింద్ తన ఇంట్లో భారీ పార్టీ ఇస్తున్నారు.
చిరు బర్త్ డే సందర్భంగా టోటల్ ఫ్యామిలీ మెంబర్లతో పాటు, సినిమా రంగానికి చెందిన కొందరు సెలబ్రిటీలను కూడా ఆహ్వానించారు.