సైరా-చరణ్ మాట నమ్మొచ్చా?

అభిమానుల సందోహం సాక్షిగా, 2019 సమ్మర్ కు సైరాను థియేటర్లలోకి తీసుకువస్తున్నట్లు నిర్మాత రామ్ చరణ్ వెల్లడించారు. అయితే ఆ పరిస్థితి వుందా? అన్నది అనుమానంగా వుంది. సైరా సినిమా ఇప్పటి వరకు షూటింగ్…

అభిమానుల సందోహం సాక్షిగా, 2019 సమ్మర్ కు సైరాను థియేటర్లలోకి తీసుకువస్తున్నట్లు నిర్మాత రామ్ చరణ్ వెల్లడించారు. అయితే ఆ పరిస్థితి వుందా? అన్నది అనుమానంగా వుంది. సైరా సినిమా ఇప్పటి వరకు షూటింగ్ చేసింది చాలా తక్కువే అని వినిపిస్తోంది. ముఖ్యమైన వార్ ఎపిసోడ్ లు మినహా మామూలు సీన్లు షూట్ చేసింది చాలా తక్కువని తెలుస్తోంది. సినిమాకు వేసుకున్న షెడ్యూళ్లే వచ్చే ఏడాది మార్చి దాటే వరకు వున్నాయని తెలుస్తోంది.

కానీ సైరా షూట్ అనుకున్నట్లు సాగడం లేదని వినికిడి,. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి కాస్త వేగంగా అలసిపోతున్నారని, ఆయన పరిస్థితి దృష్టిలో పెట్టుకుని సావధానంగా షూట్ చేస్తున్నారని తెలుస్తోంది. మెగా క్యాంప్ వర్గాల్లో వినిపిస్తున్నది ఏమిటంటే, సైరా నిర్మాణం మొత్తం పూర్తయ్యేసరికి ఆగస్టు రావచ్చు అని.

మరి అదే నిజమైతే సైరా సమ్మర్ కు రావడంకష్టం అవుతుంది. పైగా సైరా లాంటి సినిమాకు మాంచి డేట్ కూడా అవసరం. కానీ రాబోయే సమ్మర్ లో మహేష్ బాబు సినిమా, అవకాశం కుదరితే బోయపాటి-బాలయ్య సినిమా కూడా వుంటాయని టాక్. అలాంటపుడు సమ్మర్ కు సైరాను షెడ్యూలు చేస్తారా? అన్నది అనుమానం.

టీజర్ తో నిరాశ
సైరా టీజర్ అహో.. అద్భుతం.. అమోఘం అన్న మాటలు ఎక్కడ చూసినా వినిపించాయి. కానీ టాలీవుడ్ ఇన్ సైడ్ టాక్ లో మాత్రం పూర్తిగా పెదవి విరుపులే వినిపించాయి. టీజర్ వదలి తొందరపడ్డారని, జస్ట్ ఓ లుక్ నో, మోషన్ పోస్టర్ నో వదిలి వుంటే బెటర్ అని కామెంట్ లు వినిపిస్తున్నాయి.

టీజర్ లో భారీతనం మచ్చుకైనా కనిపించలేదని, పైగా కోట మీద నిల్చోవడం, బన్నీ గోనగన్నారెడ్డి క్యారెక్టర్ ను, గెటప్ గతంలో చిరంజీవి రిక్షావోడు సినిమాను, గుర్రం పక్క నుంచి ఉరకడం మగధీర సినిమాను, రెండు కాళ్లు పైకి ఎత్తి నిలబెట్డం గౌతమీపుత్ర సినిమాను గుర్తుకు తెస్తున్నాయని, కొత్తగా ఏదయినా చూపించి వుంటే బాగుండేదని కామెంట్ లు వినిపిస్తున్నాయి.

పట్టుపని పదిమంది లేకుండా, హడావుడి లేకుండా ఏరియల్ షాట్ వేసారని కూడా అంటున్నారు. పైగా ఏడాది ముందు టీజర్ వేస్తే, జనం మరచిపోతారని టాక్. పైకి ఏమీ అనకున్నా, అంతర్గత చర్చలు అన్నింటిలో టీజర్ మీద నెగిటివ్ అభిప్రాయాలే వినిపిస్తున్నాయి.