ఆగస్టు 31 బరిలోంచి అనివార్యంగా, తప్పుకోవాల్సి వచ్చింది శైలజారెడ్డి అల్లుడు సినిమా. అయితే తరువాత డేట్ ఎప్పుడు అన్నది పాయింట్. ఇక్కడ కూడా తకరారు తప్పేలా కనిపించడం లేదు. ఎందుకంటే ఆ రోజు ఇప్పటికే రెండు సినిమాలు డేట్ లు ఇచ్చాయి. ఒకటి సుధీర్ బాబు స్వంత సినిమా నన్ను దోచుకుందువటే..nరెండవది యుటర్న్.
ఇప్పుడు ఈ యుటర్న్ సినిమాతోనే సమస్య. ఈ సినిమాలో మెయిన్ లీడ్ హీరోయిన్ సమంత. మరి ఆమె సినిమా మీద చైతన్య సినిమా వేస్తే బాగుంటుందా? అలా అని వాళ్లను 13 కాకుండా 14కు వెళ్లమంటే నో అంటున్నారట. పోనీ వీళ్లే 14న చేద్దాం అంటే డిస్ట్రిబ్యూటర్లు నో అంటున్నారు.
ఇదిలా వుంటే ఇంకో సమస్య కూడా వుంది. సినిమా ద్వితీయార్థంలో వెన్నెల కిషోర్ మీద ఓ మాంచి బ్లాక్ ఒకటి సెట్ చేయాలని సలహా ‘పై నుంచి’ వచ్చింది. కాదనడానికి లేదు. కానీ వెన్నెల కిషోర్ 28కి కానీ అమెరికా నుంచి రావడంలేదు. వచ్చాక, రమ్యకృష్ణ, చైతూ కాంబినేషన్ లో ఆ సీన్ షూట్ చేయాలి. అదో రెండు రోజులు. అంటే ఒకటి రెండు తేదీలు వస్తాయి. డేట్ లు సెట్ కాకపోతే మరింత ఆలస్యం.
అసలు ఈ సీన్ లేకపోతే హ్యాపీగా 6వ తేదీకి వచ్చేసేవారు. కానీ ‘పై వారి’ ఆజ్ఞ పాటించాలి కదా. మొత్తంమీద మళ్లీ మరోసారి శైలజారెడ్డి అల్లుడు విడుదల తేదీ వార్తల్లో నలిగే పరిస్థితి వచ్చింది.