అమెజాన్ లో త్వరగా ఆచార్య?

ఆచార్య సినిమా అతి త్వరగా అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం కానుందా? టాలీవుడ్ సర్కిళ్లలో వినిపిస్తున్నది ఇదే. ఆచార్యను 30 రోజుల అగ్రిమెంట్ మీద అమెజాన్ కు ఇచ్చారని, ఆ లెక్కన ఈ నెల…

ఆచార్య సినిమా అతి త్వరగా అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం కానుందా? టాలీవుడ్ సర్కిళ్లలో వినిపిస్తున్నది ఇదే. ఆచార్యను 30 రోజుల అగ్రిమెంట్ మీద అమెజాన్ కు ఇచ్చారని, ఆ లెక్కన ఈ నెల 25 కు కాస్త అటు ఇటుగా ప్రసారం కావాల్సి వుందని తెలుస్తోంది. అయితే ఇటీవల కాస్త త్వరగా అమెజాన్ లో ప్రసారం చేసుకుంటే కాస్త అదనపు అమౌంట్ ఇచ్చే పద్దతి ఒకటి అలవాటు అయింది.

ఇప్పుడు ఈ పద్దతిని అడాప్ట్ చేయడానికి ఆచార్య ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాక్సాఫీస్ దగ్గర ఆచార్య ఫెయిలయిందన్నది వాస్తవం. అందువల్ల డిస్ట్రిబ్యూటర్లను ఇంతో అంతో ఆదుకోవాల్సి వుంటుంది. 

అలా ఆదుకోవాలంటే నిర్మాత లేదా దర్శకుడు మరింత నష్టపోవాల్సి వస్తుంది. అందుకే అలా నష్టపోకుండా అమెజాన్ నుంచి ఎంతో కొంత రాబట్టగలిగితే బయ్యర్లను ఆదుకోవచ్చు అనే ఆలోచనలు సాగుతున్నట్లు తెలుస్తోంది.

అయితే వ్రతం చెడ్డా ఫలితం దక్కాలి. త్వరగా ఇచ్చినందుకు సరిపడా ప్రతిఫలం దక్కితే ఫరవాలేదు. బయ్యర్లను ఆదుకోవచ్చు. అలా కాకుండా పెద్దగా అదనపు ఆదాయం రాకుండా ఇవ్వడం వృధా. పైగా అలా ఇచ్చారని బ్యాడ్ నేమ్ వస్తుంది. 

అందుకే మల్లగుల్లాలు పడుతున్నారు. డిస్కషన్లు సాగుతున్నాయి. ఈ వారాంతానికి కానీ క్లారిటీ రాదని తెలుస్తోంది.