ఎఎమ్ బిలో దూకుడు హడావుడి

ఏనాడి సినిమానో దూకుడు. ఇప్పటికీ జనం ఆ సినిమాలో ఫన్ అంటే పిచ్చిగా ఇష్టపడతారు. శ్రీనువైట్ల అల్టిమేట్ కామెడీకి ఆ సినిమానే ఉదాహరణ. మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా హైదరాబాద్ ఎఎమ్ బి…

ఏనాడి సినిమానో దూకుడు. ఇప్పటికీ జనం ఆ సినిమాలో ఫన్ అంటే పిచ్చిగా ఇష్టపడతారు. శ్రీనువైట్ల అల్టిమేట్ కామెడీకి ఆ సినిమానే ఉదాహరణ. మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా హైదరాబాద్ ఎఎమ్ బి మల్టీఫ్లెక్స్ లో దూకుడు సినిమాను రెండు ఆటలు ప్రదర్శించారు. ఫ్యాన్స్ విరగబడి వచ్చి హవుస్ పుల్ చేయడం విశేషం.

ఫ్యాన్స్ ప్లాన్ చేసిన ఈ షోల సంగతి తెలిసి, నమ్రత మొత్తం రెండు షోల ప్రేక్షకులకు స్నాక్స్, డ్రింక్స్ ప్రత్యేకంగా అందించే ఏర్పాటు చేసారట. ఓ చిన్న ఫ్యాక్ లో రెండు మూడురకాల స్నాక్స్, కూల్ డ్రింక్ కలిపి అంతమందికి అందే ఏర్పాటు చేసారట.

ఫ్యాన్స్ విషయంలో మహేష్ బాబు, నమ్రత చాలా కేర్ తీసుకుంటున్నారు. వాళ్లు కూడా సోషల్ మీడియాలో అలాగే హల్ చల్ చేస్తున్నారు. మహేష్ బర్త్ డే సందర్భంగా ముందుగా కామన్ డిపి పెట్టడం, బర్త్ డే విసెష్ ను ట్రెండింగ్ లోకి తీసుకురావడంలో ఫ్యాన్స్ తెగ వర్క్ చేసారు.