ఇప్పటికైనా త్రివిక్రమ్ ను గుర్తించు నాగ్!

మన్మథుడు, మన్మథుడు-2 సినిమాల మధ్య ఎలాంటి పోలిక లేకపోయినా, కొత్త సినిమాకు మన్మథుడు-2 అనే టైటిల్ పెట్టారు కాబట్టి ఆటోమేటిగ్గా కంపారిజన్స్ కూడా వస్తున్నాయి. మరీ ముఖ్యంగా మన్మథుడు-2 సినిమాలో త్రివిక్రమ్ లేని లోటు…

మన్మథుడు, మన్మథుడు-2 సినిమాల మధ్య ఎలాంటి పోలిక లేకపోయినా, కొత్త సినిమాకు మన్మథుడు-2 అనే టైటిల్ పెట్టారు కాబట్టి ఆటోమేటిగ్గా కంపారిజన్స్ కూడా వస్తున్నాయి. మరీ ముఖ్యంగా మన్మథుడు-2 సినిమాలో త్రివిక్రమ్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. నాగార్జున ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా మన్మథుడు సినిమాకు త్రివిక్రమ్ వెన్నెముక. అతడే లేకపోతే అంత మంచి కామెడీ ట్రాక్ పండేదికాదు, అతడే లేకపోతే అన్ని మంచి డైలాగులు వచ్చేవి కావు, అతడే లేకపోతే స్క్రీన్ ప్లే అలా ఉండేదికాదు.

ఇప్పుడు “అతడు” లేడు కాబట్టే మన్మథుడు-2లో ఆ లోటు స్పష్టంగా కనిపిస్తోంది. పేరుకు ఇది రీమేక్ అయినప్పటికీ మంచి సీన్స్ రాసుకోవచ్చు. కామెడీ పండించడానికి కావాల్సినంత స్కోప్ పుష్కలంగా ఉంది. ఇక డైలాగ్స్ సంగతి సరేసరి. ఈ విభాగాలన్నింటిలో వెలితి స్పష్టంగా కనిపిస్తోంది. త్రివిక్రమ్ లాంటి వ్యక్తి లేకపోవడం వల్లనే మన్మథుడు-2 ఇలా అడల్ట్ మూవీగా మారిందంటూ సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ పడుతున్నాయి.

అసలు ఈ సినిమాకు మన్మథుడు టైటిల్ ను పిక్ చేసుకోవడమే నాగార్జున చేసిన అతి పెద్ద తప్పు అంటున్నారు అతడి అభిమానులు. ఒకవేళ అదే టైటిల్ ను ఫిక్స్ చేయాలని అనుకున్నప్పుడు, త్రివిక్రమ్ ను లైన్లో పెట్టి ఉంటే బాగుండేది అభిప్రాయపడుతున్నారు. తన కెరీర్ లో క్లాసిక్ లాంటి సినిమాను నాగార్జున తన చేతులతో తానే నాశనం చేశాడని ఆరోపిస్తున్నారు. తండ్రి ఏఎన్నార్ నటించిన సినిమాల్ని రీమేక్ చేసి వాటి ఔన్నత్యాన్ని చెడగొట్టనని పదేపదే చెప్పే నాగార్జున, మన్మథుడు లాంటి క్లాసిక్ సినిమాను ఎందుకు చెడగొట్టాడో చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇకనైనా ప్రయోగాల పేరిట ఇలాంటి పిచ్చి పనులకు స్వస్తి చెప్పాలని సూచిస్తున్నారు.

మొత్తమ్మీద మన్మథుడు-2 ఫ్లాప్ తో త్రివిక్రమ్-నాగార్జున వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పటికైనా త్రివిక్రమ్ గొప్పదనాన్ని గుర్తించమంటూ “గురూజీ ఫ్యాన్స్” సోషల్ మీడియాలో నాగ్ ను ట్రోల్ చేస్తున్నారు. అటు నాగార్జున ఫ్యాన్స్ కూడా ఈ సినిమాను ఫ్యామిలీ మూవీగా ప్రమోట్ చేయొద్దని మొరపెట్టుకుంటున్నారు. ఈ సినిమాతో నాగార్జున అటు తన ఫ్యాన్స్ ను నిరాశపరచడంతో పాటు.. త్రివిక్రమ్ అభిమానుల ఆగ్రహానికి కూడా గురవుతున్నాయి. ఏ విధంగానూ అతడికి ఈ సినిమా కలిసిరాలేదు.