ఆమెకి ఫిదా అయిన మురుగదాస్‌

స్టార్‌ డైరెక్టర్‌ మురుగదాస్‌తో సినిమా చేయడానికి ఇండియాలో ఉన్న అందరు సూపర్‌స్టార్స్‌ ఎప్పుడూ రెడీగా ఉంటారు. నేషనల్‌ రేంజ్‌లో అంతగా తన ముద్ర వేసిన మురుగదాస్‌ ఉన్నపళంగా ఎవరితో అంటే వారితో సినిమా చేసుకునే…

స్టార్‌ డైరెక్టర్‌ మురుగదాస్‌తో సినిమా చేయడానికి ఇండియాలో ఉన్న అందరు సూపర్‌స్టార్స్‌ ఎప్పుడూ రెడీగా ఉంటారు. నేషనల్‌ రేంజ్‌లో అంతగా తన ముద్ర వేసిన మురుగదాస్‌ ఉన్నపళంగా ఎవరితో అంటే వారితో సినిమా చేసుకునే సౌలభ్యం ఉన్నా కూడా అందరు హీరోలని కాదని ఒక హీరోయిన్‌తో సినిమా చేయడానికి సిద్ధపడుతున్నాడు. 

హాలిడే అనే హిందీ సినిమాలో తన దర్శకత్వంలో నటించిన సోనాక్షి సిన్హాతో మురుగదాస్‌ ఒక లేడీ ఓరియెంటెడ్‌ సినిమా చేయబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా సోనాక్షి తెగ సంతోష పడిపోతూ ప్రకటించింది. జీనియస్‌ మురుగదాస్‌తో లేడీ ఓరియెంటెడ్‌ మూవీ చేస్తున్నా అని, అది యాక్షన్‌ ప్రధాన చిత్రమని సోనాక్షి చెప్పింది. 

నవంబర్‌లో ఈ చిత్రం సెట్స్‌ మీదకి వెళుతుందట. ప్రస్తుతం మురుగదాస్‌ తమిళంలో విజయ్‌, సమంతతో కత్తి అనే సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత తెలుగులో ఒక స్టార్‌ హీరోతో చేస్తాడని వార్తలొచ్చాయి కానీ ఇప్పుడు సోనాక్షి సినిమా న్యూస్‌తో అది నిజం కాదని తేలింది.