టాలీవుడ్ ను భయపెడుతున్న అమెరికా

బ్రిటన్ లో పుట్టిన కరోనా కొత్త వెర్షన్ అమెరికాను కలవరపెడుతోంది. రోజు రోజుకు అక్కడ కేసులు పెరిగిపోతున్నాయి. యుకె అంతటా ఈ నేపథ్యంలో కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు.  Advertisement అమెరికాలో కూడా రెస్టారెంట్లు వగైరా…

బ్రిటన్ లో పుట్టిన కరోనా కొత్త వెర్షన్ అమెరికాను కలవరపెడుతోంది. రోజు రోజుకు అక్కడ కేసులు పెరిగిపోతున్నాయి. యుకె అంతటా ఈ నేపథ్యంలో కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. 

అమెరికాలో కూడా రెస్టారెంట్లు వగైరా మూతపెడుతున్నారు. అయితే ఈ సమస్య ఎప్పటి వరకు వుంటుందన్నది క్లారిటీ లేదు. పైగా ఇలాంటి టైమ్ లో ఓ కొత్త మాట కూడా వినిపిస్తోంది. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారిని వైరస్ ఏమీ చేయలేకపోవచ్చుననీ, కాని వారి టచ్ నుంచి వేరే వారికి సోకకుండా వుండడం మాత్రం అసాధ్యమని అంటున్నారు. 

ఇలాంటి నేపథ్యంలో కనీసం మరో రెండు మూడు నెలలు సోషల్ డిస్టెన్స్ అన్నది అనివార్యంగా కనిపిస్తోంది.  ఇలాంటి నేపథ్యంలో మార్చి నెలాఖరు నుంచి జూన్ నెలాఖరు వరకు ప్లాన్ చేసుకున్న పెద్ద సినిమాలు ఏవీ అక్కడ విడుదలయ్యే పరిస్థితి వుంటుందా అన్నది అనుమానంగా వుంది. 

పెద్ద హీరోల సినిమాలకు దాదాపు ఎనిమిది నుంచి పన్నెండు కోట్ల వ్యాపారం జరుగుతుంది ఓవర్ సీస్ లో. ఇప్పుడు అదంతా పోయేలా వుంది పరిస్థితి చూస్తుంటే.

ఆ మేరకు హీరోలు, డైరక్టర్లు తగ్గించుకుంటారా?అన్నది కూడా అనుమానం. మన టాప్ హీరోలు అంతా యాభై కోట్లు అనే గీత గీసుకుని కూర్చున్నారు, టాప్ ఫైవ్ డైరక్టర్లు 15 నుంచి 25 కోట్ల లెక్కలు పెట్టుకుని వున్నారు. 

అవేమన్నా ఓవర్ సీస్ రేషియో మేరకు తగ్గితే నిర్మాతలు ధైర్యం చేస్తారు. లేదూ అంటే పరిస్థితి కష్టంగా వుంటుందని టాలీవుడ్ వర్గాల బోగట్టా. ఇదిలా వుంటే అమెరికాలో లేదా విదేశాల్లో షూటింగ్ చేయాల్సిన సినిమాలు కూడా ఎక్కడివక్కడ అలా వుండిపోయాయి. 

ముంబై నైట్ లైఫ్ అంటే చాలా ఇష్టం

అవుటాఫ్‌ ది బాక్స్‌ ఆలోచించక తప్పని పరిస్థితి