Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అమృతం అంజిగా ఎవరంటే..?

అమృతం అంజిగా ఎవరంటే..?

అమృతం కామెడీ సీరియల్..నిజంగా 'అమృతమే'. టీవీలో మోత మోగించిన తరువాత యూ ట్యూబ్ లో సదా ప్లే అవుతూనే వచ్చింది. ఇటీవల వున్నట్లుంది అమృతం ఎపిసోడ్ లు యూ ట్యూబ్ లో మాయమయ్యాయి. దీనికి సరైన కారణమే వుంది. అమృతం సీరియల్ ఎపిసోడ్ లు అన్నింటినీ జీ-5 ఆన్ లైన్ ఫ్లాట్ ఫారమ్ కొనేసింది. తన యాప్ లో లోడ్ చేసేసింది.

అంతే కాదు, అమృతం 2 అంటూ వెబ్ సిరీస్ ను తయారు చేసే పనిలో పడింది. మళ్లీ గుణ్ణం గంగరాజు అండ్ కో ఈ విషయంలో బిజీ అయ్యారు. అంటే అంజి, సర్వర్ ఇలా అన్ని క్యారెక్టర్లు మళ్లీ మన ముందుకు రాబోతున్నాయి. కానీ అంజి క్యారెక్టర్ లో జీవించేసిన గుండు హనుమంతరావు మన ముందు లేరు. మిగిలిన వారు చాలా మంది అమృతం 2 లో కూడా కంటిన్యూ అవుతారు.

అంజిగా మాత్రం సీనియర్ కమెడియన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్టు ఎల్ బి శ్రీరామ్ నటించబోతున్నారు. కామెడీ పాత్రలతో తెరపైకి వచ్చిన రచయిత ఎల్ బి శ్రీరామ్, తరువాత తరువాత సీరియస్ పాత్రల్లోకి మారిపోయారు. మళ్లీ ఇన్నాళ్ల తరువాత అంజి పాత్రలో ఎల్ బి శ్రీరామ్ కామెడీ పండించబొతున్నారు.

త్రివిక్రమ్ ఫ‌వ‌ర్ పూల్ స్వీచ్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?