ఒకప్పుడు బ్రహ్మానందం లేని సినిమా లేదు. బ్రహ్మీ వేసినన్ని వేషాలు మరే కమెడియన్ వేయలేదు. అత్తారింటికి దారేదిలో బ్రహ్మీ కోసం త్రివిక్రమ్ రాసిన స్పూఫ్ ఇప్పటికీ వైరల్ నే. కానీ కాలం మారింది. బ్రహ్మీ కి వయసు మీద పడింది. సినిమాలు తగ్గించుకున్నారు. సరైన క్యారెక్టర్లు పడడం లేదు. సినిమా జనాలు కూడా దాదాపు బ్రహ్మీని వదిలేసారు.
అయితే గతంలో రేసుగుర్రంలో బ్రహ్మీ ఫ్యాక్టర్ ను బన్నీ, అత్తారింటికి దారేదిలో స్కిట్ ను త్రివిక్రమ్ బాగా గుర్తు పెట్టుకున్నట్లుంది. అందుకే వారి కాంబినేషన్ లోని లేటెస్ట్ మూవీ 'అల వైకుంఠపురములో' సినిమా కోసం బ్రహ్మీని మళ్లీ ఒక్కసారి తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది.
సినిమాలో బహ్మీకి పాత్ర అంటూ ఏదీ లేదు కానీ, ఓ పాటలో మాత్రం బ్రహ్మీ తళుక్కున మెరుస్తాడని తెలుస్తోంది. ఫుల్ స్టయిలిష్ బ్రహ్మీని మళ్లీ ఫ్యాన్స్ ఓసారి చూసే అవకాశం వుంది. ఇదిలా వుంటే త్రివిక్రమ్ తన స్నేహితుడు సునీల్ కు కూడా ఈ సినిమాలో చిన్న పాత్ర ఇచ్చారు.