మహేష్ మూవీలో తమన్న పాత్ర ఇదే!

తమన్నాకు ఐటెంసాంగ్స్ కొత్తకాదు. ఇప్పటికే పలు ఐటెంసాంగ్స్ లో ఆమె డాన్స్ చేసింది. కానీ సరిలేరు నీకెవ్వరు సినిమాలో మాత్రం ఆమె చేసింది ఐటెంసాంగ్ కాదంటున్నాడు దర్శకుడు అనీల్ రావిపూడి. మిల్కీ బ్యూటీ చేసిన…

తమన్నాకు ఐటెంసాంగ్స్ కొత్తకాదు. ఇప్పటికే పలు ఐటెంసాంగ్స్ లో ఆమె డాన్స్ చేసింది. కానీ సరిలేరు నీకెవ్వరు సినిమాలో మాత్రం ఆమె చేసింది ఐటెంసాంగ్ కాదంటున్నాడు దర్శకుడు అనీల్ రావిపూడి. మిల్కీ బ్యూటీ చేసిన డాంగ్..డాంగ్ అనే పాటను స్పెషల్ సాంగ్ గా చెప్పుకొస్తున్నాడు.

“ఆర్మీ వాళ్లతో తమన్న డాన్స్ ఏంటనే డౌట్స్ చాలామందికి ఉన్నాయి. రియల్ లైఫ్ లో ఆర్మీ జవాన్లను చాలాసార్లు చాలా మంది సెలబ్రిటీలు వెళ్లి కలిశారు. చాలామంది బాలీవుడ్ హీరోయిన్లు ఇలా చేశారు. ప్రియాంక చోప్రా ఓసారి ఇలా చేయడం నేను టీవీలో చూశాను. ఆ కాన్సెప్ట్ నాకు నచ్చింది. అందుకే తమన్నాతో ఆ కాన్సెప్ట్ ను ఈ సినిమాలో చూపించాను.”

సరిలేరు నీకెవ్వరు సినిమాలో తమన్న ఓ సినిమా హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అవుతుందట. ఆర్మీని కలిసి వాళ్లకు పార్టీ ఇచ్చే సందర్భంలో ఈ పాట వస్తుందని, తన ఆట-పాటతో ఆర్మీలో ఉత్సాహం తెప్పిస్తుందని అంటున్నాడు అనీల్ రావిపూడి. అందుకే డాంగ్ డాంగ్ సాంగ్ ను ఐటెంసాంగ్ అనొద్దని, దాన్నొక స్పెషల్ సాంగ్ గా చూడాలంటున్నాడు.

తమన్న ఐటెంసాంగ్ ను మినహాయిస్తే సినిమాలో మరో సర్ ప్రైజ్ కూడా ఉందంటున్నాడు అనీల్. అది మాత్రం తను ఇప్పుడే చెప్పనని, థియేటర్లలో సినిమా చూసి తెలుసుకోవాలని కోరుతున్నాడు. 11న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తోంది. 10వ తేదీ అర్థరాత్రి నుంచే ప్రీమియర్స్ ప్లాన్ చేశారు.