ఎమీకి అక్షయ్ సపోర్టు?

ఎమీ జాక్సన్..ఇప్పుడు సూపర్ స్టార్ రజనీ చెంత హీరోయిన్..దిగ్దర్శకుడు శంకర్ సినిమాలో రెండో చాన్స్. జనాలకు కాస్త ఆశ్చర్యమే. ఎందుకంటే మొన్నటికి మొన్న ఆమెతో శంకర్ చేసిన ఐ సినిమా భయంకరమైన డిజాస్టర్. ఆమెతో…

ఎమీ జాక్సన్..ఇప్పుడు సూపర్ స్టార్ రజనీ చెంత హీరోయిన్..దిగ్దర్శకుడు శంకర్ సినిమాలో రెండో చాన్స్. జనాలకు కాస్త ఆశ్చర్యమే. ఎందుకంటే మొన్నటికి మొన్న ఆమెతో శంకర్ చేసిన ఐ సినిమా భయంకరమైన డిజాస్టర్. ఆమెతో చేసిన సినిమాలన్నీ అట్టర్ ఫ్లాపులే. హిందీలో చేసినవి కూడా. అందుకే మళ్లీ శంకర్ ఎలా చాన్సిచ్చాడా అని అందరికీ ఆశ్చర్యం. 

అయితే ఈ మొత్తం వ్యవహారం వెనుక వున్నది అక్షయ్ కుమార్ అని ఇప్పుడు తమిళ చిత్ర రంగంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అక్షయ్ కుమార్ ఇప్పుడు ఎమీజాక్సన్ కు మాంచి దోస్త్ అంట. ఎమీ ఏ సినిమాలు చేయాలి..చేయకూడదు..ఎమీకీ చాన్స్ లు ఎలా? ఇలాంటి విషయాలన్నింటిపై అక్షయ్ చాలా కీలకంగా వున్నాడట. రోబో 2లో విలన్ గా అక్షయ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. 

ఈ లింక్ తో శంకర్ కు రికమెండ్ చేసి, కాస్త గట్టిగానే చెప్పి, ఒప్పించాడు అక్షయ్ అన్నది లేటెస్ట్ గ్యాసిప్.