చిరంజీవి 150 వ సినిమా ఎప్పుడు అన్నది ఓ భేతాళ ప్రశ్న. ఇదిలా వుంటే 151 నేను చేస్తా అని డైరక్టర్లు..నేను నిర్మిస్తా అని నిర్మాతలు అనడం కూడా వినిపిస్తోంది. కానీ ఇఫ్పుడు పేలిన బాంబు లాంటి వార్త ఏమిటంటే..తాను ఇక 151 సినిమా చేసేది లేదు అని చిరంజీవి స్పష్టం చేసేసారు..
జనవరి ఫస్ట్ న ఆయనను కొందరు అభిమానులు కలిసారు. అభిమానుల కోరిక మేరకు 150 వ సినిమాగా కత్తి చేస్తున్నా అని, ఇక అదే ఆఖరు అని ఆయన స్పష్టంగా చెప్పేసారట. మళ్లీ మళ్లీ తనను ప్రెజర్ చేయవద్దని చిరంజీవి స్ఫష్టంగా చెప్పేసారట. అయితే అభిమానులు, 150 సూపర్ హిట్ గ్యారంటీ అని, అలా జరిగాకే 151 చేయాలని కోరారట.
ఆ సంగతి తరువాత అని, మీరు మాత్రం తనను ఇంక నటించాలి అను పట్టబట్టవద్దని చిరంజీవి అన్నారట. అంటే పాపం చిరంజీవిని డైరక్ట్ చేయాలన్న పూరి ఆశలు అడియాశలేనా?