ఆనందికి మరో సినిమా

ఎవడో సుబ్రహ్మణ్యం సినిమాతో తళుక్కున మెరిసింది మాళవికా నాయర్ తెలుగు తెరపై. మనిషి రూపు రేఖలు మరీ అద్భుతంగా లేకున్నా,.. ఆ సినిమాలో హీరోయిన్ ఆనందిగా చలాకీగా బాగానే చేసింది  అందుకే ఇప్పుడు రెండో…

ఎవడో సుబ్రహ్మణ్యం సినిమాతో తళుక్కున మెరిసింది మాళవికా నాయర్ తెలుగు తెరపై. మనిషి రూపు రేఖలు మరీ అద్భుతంగా లేకున్నా,.. ఆ సినిమాలో హీరోయిన్ ఆనందిగా చలాకీగా బాగానే చేసింది  అందుకే ఇప్పుడు రెండో చాన్స్ వెతుక్కుంటూ వచ్చింది. నందినీ రెడ్డి మూడో సినిమా లో నాగశౌర్య పక్కన హీరోయిన్ గా ఎంపికయింది. 

నందినీకి తొలి అవకాశం ఇచ్చిన రంజిత్ మూవీస్ సంస్థే ఈ సినిమాను నిర్మిస్తుంది. అలా మొదలైంది తరువాత సమంత, సిద్దార్ధలతో భారీ సినిమా ప్రయత్నించి, విఫలమైంది నందినీ రెడ్డి. మళ్లీ రంజిత్ మూవీస్ సంస్థే అవకాశం ఇచ్చి ఆదుకుంది. ఈ సినిమా త్వరలో ప్రారంభమవుతుంది.​