బిగ్ బాస్ షో స్టార్ట్ అయిన మూడు రోజులు దాటింది. అత్యంత నీరసంగా సాగుతోంది. గంట సేపు షో రన్ అవుతోంది కానీ, అస్సలు చూడడానికి ఏమాత్రం ఆసక్తి కరంగా లేదన్నది వీక్షకుల మాట. వైల్డ్ కార్డ్ ఎంట్రీ మీద కొంత మందిని కొత్తగా లోపలకు పంపిస్తే తప్ప, షో కు హుషారు రాదని నిర్వాహకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
వైల్డ్ కార్డ్ ఎంట్రీ జాబితా కాస్త పెద్దదే వుంది కానీ, ముఖ్యంగా హీరోయిన్ మంచు లక్ష్మి, మరువాడ తేజస్వనిల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే మంచు లక్ష్మి అప్పుడే కాదని, సగం ఎపిసోడ్ లు అయ్యాక వెళ్తారని తెలుస్తోంది. ఇదిలా వుంటే షోకి ఇప్పటికిప్పుడు జోష్ తేవాలంటే ఎవర్నయినా అర్జెంట్ గా పంపాలని అనుకుంటున్నారట.
అందుకోసం గ్లామరస్ ఏంకర్ అనసూయ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అనసూయ చాలా షో లకు ఏంకరంగ్ చేస్తూ బిజీగా వున్నారు. అందువల్ల ఈ మేరకు చర్చలు సాగుతున్నట్లు వినికిడి. బిగ్ బాస్ షో కోసం ఇండస్ట్రీలో చాలా మందిని సంప్రదించారు కానీ, ఆ నిబంధనలు, 70రోజులు వుండాల్సి రావడం వల్ల చాలా మంది నో చెప్పారు. ఆఖరికి ఇప్పుడున్న 14మంది దొరికారు.
అయితే వీళ్లతో షో కి జోష్ రావడం లేదని, అనసూయను పంపాలని కొంతమంది నిర్వాహకులకు సూచించారట. మరి అనసూయ ఒప్పుకుంటే, వెంటనే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా లోపలకు వెళ్లే అవకాశం వుంది. ఇదిలా వుంటే గాయని కల్పన వితవుట్ మేకప్, నైటీతో షో లో తిరుగుతుంటే, మరీ డీ గ్లామరస్ గా వున్నారని, ఆమెకు కాస్త డ్రెస్ సెన్స్ పాటించమని సూచించమని కూడా బిగ్ బాస్ నిర్వాహకులకు చానెల్ నుంచి సజెషన్ వెళ్లినట్లు వినికిడి.