పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఓ కొలిక్కి రాబోతోంది. ఈ సినిమాకు సంబంధించి బల్గేరియాలో ఓ భారీ షెడ్యూల్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం శనివారం నుంచి బల్గేరియా షెడ్యూల్ ప్రారంభం కానుంది.
త్రివిక్రమ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా కథ ప్రకారం యూరోప్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. అందుకే బల్గేరియాను తొలి స్పాట్ గా ఎంచుకున్నారు. తర్వాత యూరోప్ లోని మరికొన్ని దేశాల్లో కూడా షూటింగ్ చేస్తారు.
సినిమాలో కీలకమైన సన్నివేశాల్ని యూరోప్ లోనే పిక్చరైజ్ చేస్తారట. కొన్ని సన్నివేశాలతో పాటు హీరోయిన్ అను ఎమ్మాన్యుయేల్ తో వచ్చే ఓ డ్యూయట్ ను కూడా బల్గేరియాలో షూట్ చేయబోతున్నారు. యూరోప్ షెడ్యూల్ ముగిసిన తర్వాత సినిమా టైటిల్ తో పాటు విడుదల తేదీని ఎనౌన్స్ చేసే ఆలోచనలో ఉంది యూనిట్.
పవన్ ఇందులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కనిపించబోతున్నాడు. ఒక్క పాట మినహా అనిరుధ్ ఈ సినిమాకు మ్యూజిక్ కంప్లీట్ చేశాడు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ లో ఇప్పటికే దుమ్ముదులుపుతోంది. ఆంధ్రప్రదేశ్, నైజాంలో ఈ సినిమా 90కోట్ల రూపాయల బిజినెస్ చేసింది.