బాహుబలి సెంటిమెంట్ ను సంఘమిత్ర యూనిట్ కూడా కంటిన్యూ చేయాలనుకుంటోంది. ఆ సినిమాలో కీలకమైన కట్టప్ప పాత్ర పోషించిన సత్యరాజ్ ను సంఘమిత్ర ప్రాజెక్టులోకి కూడా తీసుకోవాలని అనుకుంటోంది. తేనాండాళ్ ఫిలిమ్స్ బ్యానర్ పై దాదాపు 250కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం సత్యరాజ్ ను సంప్రదిస్తున్నారు.
మరోవైపు ఈ సినిమాలో మెయిన్ లీడ్ ఎవరనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. సంఘమిత్ర పాత్రను పోషించే హీరోయిన్ కోసం వేట కొనసాగుతూనే ఉంది. శృతిహాసన్ తప్పుకున్న తర్వాత ఎంతోమంది పేర్లు పరిశీలించారు. ప్రస్తుతం అందరి చూపు హన్సికపై పడింది. ఆమెనే ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
మరోవైపు శృతిహాసన్ కు, సంఘమిత్ర యూనిట్ కు మధ్య కోల్డ్ వార్ కొనసాగుతూనే ఉంది. యూనిట్ లో ఎవరికీ ప్రొఫెషనలిజం లేదని శృతిహాసన్ సన్నిహితుల దగ్గర కామెంట్స్ చేసిందట. ఈ విషయం అలా అలా ఖుష్బూ వరకు వెళ్లింది.
సంఘమిత్ర ప్రాజెక్టును డైరక్ట్ చేయనున్న సుందర్ సి.. ఖుష్బూకు భర్త. దీంతో ఖుష్బూ కూడా శృతిహాసన్ పై పరోక్షంగా విమర్శలు చేసింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాకు ప్రీ-ప్రొడక్షన్ లేకుండా ఎవరూ సెట్స్ పైకి వెళ్లరని, మాట్లాడేవాళ్లు ప్రొఫెషనిజం చూపిస్తే బాగుంటుందని చురకలంటించింది.