ఏంకర్ అంటే లంగరు అనే అర్థం వుంది. అలాంటి ఏంకర్ కే ఏంకర్ వేద్దామని చూస్తున్నాడు ఓ సీనియర్ నటుడు. టాప్ ఫై కమెడియన్లలో ఒకరైన ఈ నటుడు ఇటీవల ఓ టీవీ ఏంకర్ ను టీవీలో చూసి, మాంచి హీరోయిన్ ఫీచర్లున్నాయని కనిపెట్టేసాడు. అక్కడి నుంచి ఆ అమ్మాయి నెంబర్ తెలుసుకుని ఫోన్లు చేస్తున్నారట. నీ ఫిజిక్ సినిమా మెటీరియల్ వున్నది..ఓ సారి సాయంత్రం వచ్చేయ్..మొత్తం సెట్ చేసేద్దాం అంటున్నాడట.
మొదట లైట్ తీస్కుని, ఆపై కాస్త బాధపడి, ఇప్పుడు కోపం తెచ్చుకుని, రికార్డులు గట్రా రెడీ చేసే పనిలో పడిందట ఆ అమ్మాయి. మొత్తం సరైన సాక్ష్యాలు దొరికాక పరువు తీసి టీవీలో ఆరేద్దామని చూస్తోందట. ఆ నటుడు కొంచెం జాగ్రత్తగా వుంటే బెటరేమో?
అన్నట్లు ఈ ఎపిసోడ్ అంతా అదేదో నాగార్జున-శ్రీనువైట్ల సినిమాలో సీన్ ను గుర్తుకు తెస్తోంది. డైరక్టర్లు భలే ముందుగా ఆలోచిస్తారు ఇలాంటి జనాలుంటారని.