ఎవరన్నా ఇంటర్వ్యూ చేస్తే, సెలబ్రిటీ కాస్త కంగారు పడాలి లేదా టెన్షన్ పడాలి. కానీ ఓ సెలబ్రిటీ యాంకర్ తను చేసిన ఇంటర్వ్యూ గురించి టెన్షన్ పడుతున్నట్లు బోగట్టా.
విషయం ఏమిటంటే ఓ సెలబ్రిటీ యాంకర్ ఓ సెలబ్రిటీ డైరక్టర్ ను ఇంటర్వూ చేసింది. ఇక్కడ సమస్య కాంట్రావర్సీ కాదు. ఇంటర్వ్యూ సెన్సేషన్ కావాలని రకరకాల భంగిమలు పెట్టి చేసారు. అక్కడితో ఆగకుండా కొన్ని వల్గర్ ఆన్సర్ లు కూడా వున్నాయని తెలుస్తోంది.
క్వశ్చన్ ల బట్టే ఆన్సర్ లు వుంటాయి. కానీ ఇక్కడ క్వశ్చన్లు ఫ్రేమ్ చేయించింది కూడా సదరు సెలబ్రిటీ డైరక్టరే అనే తెలుస్తోంది. సరే ఇంటర్వూ అయిపోయింది. ప్రోమో వదలాలి. కానీ విషయం బయటకు రావడంతో కిందా మీదా అవుతున్నారు.
దీని వెనుక అసలు కారణం వేరే వుందని తెలుస్తోంది. ఇంటర్వ్యూ చేసిన సెలబ్రిటీకి అత్యంత సన్నిహితుడు ఒకరు వున్నారట. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూస్తే ఆ ఫ్రెండ్ ఎలా ఫీలవుతాడో అని సదరు యాంకర్ ఫీలవుతోందట. ఇప్పటికే ఎడిట్ చేసిన ఇంటర్వ్యూ చూసిన యాంకర్ ఈ విషయం మీద తెగ టెన్షన్ పడుతున్నట్లు బోగట్టా.