నిన్నటి నుంచి డియర్ కామ్రేడ్ సినిమా మీద వస్తున్న ప్రతి అభిప్రాయాలతో తాను ఏకీభవిస్తున్నా అని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. డియర్ కామ్రేడ్ విడుదలయిన నేపథ్యంలో మీడియాతో యూనిట్ ముచ్చటించింది. ఈ కార్యక్రమంలో విజయ్ మాట్లాడుతూ, నిన్నటి నుంచి అనేక రకాల ఫీడ్ బ్యాక్ వస్తోందని, అన్నింటితో తాను ఏకీభవిస్తున్నా అని అన్నారు. కొందరు సినిమా స్లోగా వుందని కూడా అన్నారని, ఈ సినిమాను ఇలాగే తీయాలని, ఈ కథ ఇలాగే నడస్తుందని ఆయన వివరించారు.
సినిమాను జనాల దగ్గరకు తీసుకెళ్లడానికి ఏం చేయాలో? ఎంత చేయాలో అంతా చేసానని ఆయన అన్నారు. ఏ ఒక్క చిన్న విషయం కూడా వదలకుండా కష్టపడ్డామని ఆయన అన్నారు. కలెక్షన్ల లెక్కలు తనకు తెలియవని, అయితే తన కెరీర్ లో మంచి కలెక్షన్లు అని అంటున్నారని, నాలుగు భాషల్లో ఇంతమంది జనాలను థియేటర్ కు తొలిరోజు రప్పించగలిగామా? అని ఆనందిస్తున్నానని విజయ్ అన్నారు.
ఇలాంటి సినిమాను చూడడానికి కాస్త ఓపిక వుండాలని, ఓపిక వుంటే సినిమా ఆకట్టుకుంటుందని విజయ్ అన్నారు. సినిమా సక్సెస్ మీట్ కాకినాడలో చేస్తామన్నారు. రష్మిక, డైరక్టర్ భరత్, నిర్మాత నవీన్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.