సెంటిమెంట్ కు తలొగ్గిన ఆర్.ఆర్.ఆర్

గాయం నుంచి కోలుకున్న చరణ్ ఫిట్ గా ఉన్నాడు. ఎన్టీఆర్ ఎప్పట్లానే షూటింగ్ కు రెడీ. దీంతో ఆగిపోయిన పూణె షెడ్యూల్ ను మరోసారి కొనసాగించాలని యూనిట్ ఫిక్స్ అయింది. కానీ సరిగ్గా ఇక్కడే…

గాయం నుంచి కోలుకున్న చరణ్ ఫిట్ గా ఉన్నాడు. ఎన్టీఆర్ ఎప్పట్లానే షూటింగ్ కు రెడీ. దీంతో ఆగిపోయిన పూణె షెడ్యూల్ ను మరోసారి కొనసాగించాలని యూనిట్ ఫిక్స్ అయింది. కానీ సరిగ్గా ఇక్కడే సెంటిమెంట్ తెరపైకొచ్చింది. గతంలో పూణె షెడ్యూల్ ప్రారంభమైన వెంటనే ఊహించని అవాంతరాలు ఎదురయ్యాయి. రామ్ చరణ్ కు గాయమవ్వడంతో పాటు విదేశీ నటి కూడా తప్పుకుంది. అందుకే పూణె షెడ్యూల్ స్థానంలో తమిళనాడు షెడ్యూల్ వచ్చిచేరింది.

పూణెలో తీయాలనుకున్న సన్నివేశాలన్ని ఇకపై తమిళనాడులో తెరకెక్కించబోతున్నారు. ఈ మేరకు రెక్కీ పూర్తయింది. షెడ్యూల్ కూడా ఫిక్స్ అయింది. వచ్చేనెల నుంచి ఏకథాటిగా 35 రోజుల పాటు ఈ షెడ్యూల్ జరగనుంది. ఎక్కువభాగం ఎన్టీఆర్ పైనే షూటింగ్ ఉంటుంది. ఓ వారంరోజుల పాటు తారక్-చరణ్ కాంబోలో సన్నివేశాలు తీయబోతున్నారు.

ఆర్-ఆర్-ఆర్ సినిమాకు సంబంధించి షెడ్యూల్స్ కాస్త అటుఇటు అయినా, అనుకున్న టైమ్ కు అనుకున్నట్టుగానే అన్నీ పూర్తవుతున్నాయంటున్నాడు నిర్మాత డీవీవీ దానయ్య. 50శాతం షూటింగ్ పూర్తయిన తర్వాత మాత్రమే ప్రీ-రిలీజ్ బిజినెస్ ప్రారంభిస్తామంటున్న ప్రొడ్యూసర్, నాన్-థియేట్రికల్ రైట్స్ ను మాత్రం ఓపెన్ చేసి పెట్టాడు. ఇందులో భాగంగా శాటిలైట్ రైట్స్ డీల్ ను లాక్ చేయబోతున్నారు.

డియర్ కామ్రేడ్.. విజయ్ జోక్యం నిజంగా ఉందా?

సినిమా రివ్యూ: డియర్‌ కామ్రేడ్‌