అందరికీ ఆ డేట్ కావాలి

ఒక మాంచి పాజిటివ్ డేట్ కనిపించింది అంటే సినిమాలు వాలిపోతాయి. డిసెంబర్ 19 నుంచి క్రిస్మస్ హాలీడేస్, అదే సమయంలో అమెరికాలో కూడా సెలవులు అనేసరికి, తెలుగు సినిమాలు క్యూ కట్టేయడానికి రెడీ అయిపోతున్నాయి.…

ఒక మాంచి పాజిటివ్ డేట్ కనిపించింది అంటే సినిమాలు వాలిపోతాయి. డిసెంబర్ 19 నుంచి క్రిస్మస్ హాలీడేస్, అదే సమయంలో అమెరికాలో కూడా సెలవులు అనేసరికి, తెలుగు సినిమాలు క్యూ కట్టేయడానికి రెడీ అయిపోతున్నాయి. వాస్తవానికి 2020 సంక్రాంతికి వద్దాం అనుకున్న సినిమాలు కూడా, అక్కడ దిగ్గజాల్లాంటి సినిమాలు పోటీకి దిగుతుండడంతో, డిసెంబర్ ఆఖరి వారానికి వస్తే బెటర్ అని డిసైడ్ అవుతున్నాయి.

ఎన్ని వస్తాయో, ఏవి వాయిదా పడతాయో కానీ, ప్రస్తుతానికి అయితే అరడజను సినిమాల వరకు డిసెంబర్ మూడోవారం టార్గెట్ గా రెడీ అవుతున్నాయి. రవితేజ-విఐ ఆనంద్ కాంబినేషన్ లో ' డిస్కో రాజా ', క్రాంతిమాధవ్-విజయ్ దేవరకొండ సినిమా, శర్వానంద్-సమంతల 96, నితిన్-వెంకీ కుడుమల 'భీష్మ', మారుతి-సాయితేజ్ ల ప్రతిరోజూ పండగే, బాలయ్య-కేఎస్ రవికుమార్ ల సినిమాలు వచ్చే ఆలోచనలో వున్నాయని తెలుస్తోంది.

ఈ సినిమాలు అన్నీ 20 నుంచి 25 లోపు డేట్ ల కోసం చూస్తున్నాయి. కానీ సెలవులు అన్నమాటే కానీ, డిసెంబర్ ఆఖరివారం నుంచి సంక్రాంతి వరకు ఆంధ్రలో పండగ షాపింగ్ మూడ్ నే కానీ, సినిమాల మూడ్ తక్కువ. మరి అలాంటి టైమ్ లో ఇన్ని సినిమాలు పోటీపడడం అంటే ఎలా వుంటుందో చూడాలి. 

సినిమా రివ్యూ: కౌసల్య కృష్ణమూర్తి