రాయలసీమ పాలెగాళ్ల మీద రకరకాల వెర్షన్లు వున్నాయి. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం వాళ్లను రాయలసీమ పాలిట విలన్లు గా చూస్తున్నారు.
తన ట్విట్టర్ హ్యాండిల్ లో ఈ మేరకు ఓ పుస్తకాన్ని పరిచయం చేసారు. రాయలసీమ పాలెగాళ్లు అంటూ పౌరహక్కుల సంఘం ఏనాడో ఫ్యాక్షనిజం మీద ప్రచురించిన పుస్తకం అది.
ఫ్యాక్షనిజం మీద పుస్తకానికి ఆ పేరు పెట్టి వుండొచ్చు. పాలెగాళ్ల స్థానంలో ఫ్యాక్షనిస్టులు, రాజకీయ నాయకులు వచ్చారని చెప్పడం ఉద్దేశం కావచ్చు.
కానీ పవన్ అన్న చిరంజీవి మొన్నటికి మొన్నే ఓ పాలెగాడి కథను స్వాతంత్ర్య సమర యోధుడి వీరగాథగా చిత్రీకరిస్తూ వందల కోట్ల ఖర్చుతో సైరా అనే సినిమాగా తీసారు.
పాలెగాడి జీవితాన్ని ఓ మహా చక్రవర్తి స్థాయిలో చిత్రీకరించి, మరుగునపడిపోయిన తొలి దేశపోరాట యోధుడు ఇతడే అంటూ హడావుడి చేసారు. దాని కోసమే జగన్ దగ్గర నుంచి దేశనాయకుల వరకు అందరినీ కలిసారు.
మరి ఇంతకీ పాలెగాళ్లు మంచివాళ్లనా? చెడ్డవాళ్లనా? మెగాస్టార్ మాట కరెక్ట్ నా? పవర్ స్టార్ట్ మాట నిజమా?