హీరో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ కొత్త ఇంట్లో చేరారన్నది టాలీవుడ్ వార్త. ఫిల్మ్ నగర్ డౌన్ లో సుమారు 15 కోట్లతో కొన్న కొత్త ఇంట్లోకి విజయ్ ఫ్యామిలీ మారినట్లు తెలుస్తోంది. గతంలో ఓ ఇల్లు కొన్న విజయ్ ఇది కొత్తగా కొనుగోలు చేసినట్లు బోగట్టా. గతంలో కొన్నవారు అమ్ముతుంటే విజయ్ కొన్నారని తెలుస్తోంది.
విజయ్ ఇప్పుడు మాంచి ఫామ్ లో వున్నారు. విజయ్ ఒకె అంటే తొమ్మిది కోట్ల మేరకు రెమ్యూనిరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు రెడీగా వున్నారు. చేతిలో మూడు సినిమాలు వున్నాయి. అందువల్ల విజయ్ ఈ రేంజ్ ఇల్లు కొనడం ఈజీనే.
అయితే ఎటువంటి ఫంక్షన్, హడావుడి లేకుండా విజయ్ ఇల్లు మారినట్లు తెలుస్తోంది. ఇదిలా వుంటే మరో గుసగుస కూడా వినిపిస్తోంది. విజయ్ కొన్న ఇల్లు వెనుక స్థలం బాగా లోతుగా వుంటుందని, అది విజయ్ ఇంటికి నైరుతి దిశలో వుందని, వాస్తు రీత్యా అది అంత మంచిది కాదని టాక్. అందుకే ఇప్పటికి ఆ ఇల్లు ఒకటికి రెండు సార్లు చేతులు మారిందని అంటున్నారు.
అయితే ఆ స్థలానికి విజయ్ ఇంటికి ఏ కనెక్షన్ లేదని, దేనికి అదే అని, భవిష్యత్ లో ఆ ఖాళీ స్థలంలో ఇల్లు కట్టేస్తే, సమస్యే వుండదని కూడా కౌంటర్లు వినిపిస్తున్నాయి. ఈ విషయం కొనే ముందే విజయ్ దృష్టికి తెచ్చారని, వాస్తు లాంటి మూఢనమ్మకాలు లేవని విజయ్ లైట్ తీసుకున్నారని బోగట్టా.