చచ్చీ చెడి, అనేక రీపేర్లు చేసుకొని ఆటోనగర్ ఈసూర్య ఈరోజే జనం ముందుకొచ్చింది. హడావుడిగా సినిమాని తీసుకురావడంతో ప్రచారం కూడా వీక్‌గానే సాగింది. నటీనటులు, సాంకేతిక నిపుణులూ ఈ సినిమా ప్రచారం అంటేనే ఇంతెత్తున లేచి పడుతున్నార్ట. కారణం… వాళ్ల పారితోషికాల్ని ఇంకా పూర్తిగా ముట్టజెప్పలేదట. ఆఖరికి సంగీత దర్శకుడు అనూప్కీ ఇవ్వలేదట.
గురువారం హైదరాబాద్‌లో ఆటోనగర్ సూర్య ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ జరిగింది. ప్లాటినమ్ వేడుక అంటే…. దాదాపుగా టీమ్ అంతా ఉంటుంది. కానీ.. ఆటోకి అంత సీన్ లేకుండా పోయింది. సాక్షాత్తూ సంగీత దర్శకుడే మిస్ అయ్యాడు. ప్లాటినమ్ డిస్క్ అంటేనే సంగీతోత్సవం. అలాంటి చోట… అనూప్ రాలేదంటే, అందరికీ సీన్ అర్థమైపోయింది. అనూప్‌కి డబ్బులు ఎగ్గొట్టేశారని.
కానీ నిర్మాత అచ్చిరెడ్డి మాత్రం బాగా కవర్ చేసుకొనే పనిలో పడ్డారు. `మా అనూప్ తన ఫంక్షన్లకూ రానంత బిజీ అయిపోయాడు… ` అంటూ పొగిడినట్టే పొగిడి ఎద్దేవా చేశారు. పరిస్థితి చూస్తుంటే సినిమా హిట్టయినా…. టీమ్ ప్రచారంలో పాల్గొనబోదని స్పష్టంగా అర్థమవుతోంది. పాపం.. ఈ ఆటో ఇప్పటికి ఇంతేనేమో.