ఇదే మాట వినిపిస్తోంది టాలీవుడ్ లో. ఒక పక్క కరోనా కల్లోలం అలుముకుంటోంది. విడుదలకు డేట్ లు ఇచ్చేసి, దగ్గరకు వచ్చేసిన సినిమాలే షూటింగ్ లు ఆపేసాయి. అసలు సినిమాల విడుదలలు మే, జూన్ నెలల్లో వుంటాయా? అన్నది అనుమానంగా వుంది.
ఇలాంటి పరిస్థితుల్లో హీరో నాని టక్ జగదీష్ సినిమా కూడా విడుదలకు వచ్చి, వాయిదా పడింది. అయినా నాని తన తరువాత సినిమాలు అయిన శ్యామ్ సింగ రాయ్, అంటే సుందరానికి సినిమాల షూటింగ్ లు మాత్రం ఆపడం లేదు.
శ్యామ్ సింగరాయ్ కోసం సెట్ వేసారు. వర్క్ స్టార్ట్ చేయబోతున్నారు. మరోపక్కన అంటే సుందరానికి సినిమా షూట్ కు కూడా సన్నాహాలు చేస్తున్నారు. సినిమా విడుదల దగ్గరకు వచ్చేసిన వారికి అంటే హడావుడి తప్పదు. ఓ సినిమా విడుదల పక్కన పెట్టుకుని, ఈ కరోనా నేపథ్యంలో మరో రెండు సినిమాలు అర్జెంట్ గా షూట్ చేయడం అవసరమా? అన్న కామెంట్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.
రైన్ ఫైట్ తరవాత కరోనా
కరోనా టైమ్ లో హీరో అనిపించుకున్న విలన్ సోనూ సూద్ కూ కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆచార్య షూట్ లో హీరో రామ్ చరణ్ తో రైన్ ఫైట్ లో పాల్గొన్నారు సోనూ సూద్.
ఆ తరువాతే ఆయనకు పాజిటివ్ అన్నది డిసైడ్ అయింది. దీంతో ఆ యూనిట్ లో అలజడి ప్రారంభమైంది. అయితే హీరో రామ్ చరణ్ కు తొలివిడతలోనే కరోనా వచ్చి తగ్గిందని, అందువల్ల భయం లేదని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా.
అధికారికంగా లాక్ డౌన్ ప్రకటిస్తే తప్ప షూటింగ్ లు ఆగవు. కరోనా వ్యాప్తి ఆగదు. కానీ ప్రభుత్వాలు ప్రస్తుతం లాక్ డౌన్ అనే మాటను మరచిపోయాయి.